×
Ad

Anil Ravipudi : మన శంకర వరప్రసాద్ గారు సినిమా.. పిల్లలని దూరంగా ఉంచండి.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్..

తాజాగా అనిల్ రావిపూడి సినిమా సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడారు. (Anil Ravipudi)

Anil Ravipudi

  • మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్
  • అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ
  • చిరంజీవి ఆల్కహాల్ సీన్స్ పై కామెంట్స్

Anil Ravipudi : ఇటీవల సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. గతంలో పలు సినిమాల్లో చిరంజీవి మందు తాగిన సీన్స్ చాలా సినిమాల్లో బాగా పేలాయి. ఈ సినిమాలో కూడా చిరంజీవి.. మధుపానం మహా ఆనందం మనో ధైర్యం ధనాధన్ అనే ఓ డైలాగ్ చెప్తూ మందు తాగడంతో ఇది బాగా వైరల్ అయింది.(Anil Ravipudi)

సోషల్ మీడియాలో కూడా ఈ డైలాగ్ బాగా వైరల్ అయింది. ఈ డైలాగ్ తో అందరూ రీల్స్ కూడా చేస్తున్నారు. రియల్ గా మందు తాగేవాళ్ళు కూడా దీన్ని స్లోగన్ గా తీసుకుంటున్నారు. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసిందే. అందుకే సినిమాల్లో కూడా మొదట్లోనే ఆల్కహాల్ ఆరోగ్యానికి ప్రమాదకరం అని నోట్ వేస్తారు. మందు సీన్స్ ఉన్నప్పుడు కూడా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని సినిమా కింద నోట్ వేస్తారు.

తాజాగా అనిల్ రావిపూడి సినిమా సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలు కూడా ఈ ఆల్కహాల్ డైలాగ్ తో రీల్స్ చేస్తున్నారని తెలిసి దీనిపై స్పందించారు.

Also Read : Pawan Kalyan: ప్లీజ్.. మీ ఇద్దరూ మళ్ళీ సినిమా చేయండి.. ఎస్ జె సూర్యకి జయం రవి రిక్వెస్ట్

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి పాత సినిమాల్లో నుంచి ఆ ఆలోచన వచ్చింది. మందు తాగిన సీన్స్ లో ఆయన మేనరిజం డిఫరెంట్ గా ఉంటుంది. అది ఇందులో ఎక్కువగా రుద్దలేదు. అక్కడక్కడా వెంకటేష్ సీన్ కోసం లీడింగ్ లాగా తీసుకున్నాం. కానీ ఆ సీన్ బాగా వైరల్ అయింది. మందు తాగేవాళ్ళు, లేడీస్, కొంతమంది జనాలు సరదాగా రీల్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది టీ, థమ్స్ అప్ లతో కూడా చేస్తున్నారు సరదాగా. అది తప్పులేదు.

కానీ ఒక విషయం చెప్పాలి. పిల్లలు మాత్రం దయచేసి ఇది చేయొద్దు అని చెప్తున్నా. పిల్లలని దీనికి దూరంగా ఉండండి. పిల్లలను ఈ విషయంలో ఎంటర్టైన్ చేయొద్దు. మంచిది కాదు. పిల్లలను ఇది చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆ సీన్ మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. పెద్దలు వాళ్లకు తగ్గట్టు మార్చి కొత్తగా చేస్తున్నారు. మందు తాగేవాళ్లకు ఇది ఒక స్లోగన్ అయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేయండి అని అన్నారు.

Also Read : Nidhi Agarwal: ప్రభాస్ పట్టించుకోలేదు.. ఆయన అలాంటి వ్యక్తి కాదు.. నిధి షాకింగ్ కామెంట్స్