Anil Ravipudi Mother cameto Zee Telugu Drama Juniors Show
Anil Ravipudi : చేసిన ప్రతి సినిమాతో హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అయ్యాడు అనిల్ రావిపూడి. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం సాధించి రీజనల్ సినిమాతోనే 300 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. మరో పక్క అనిల్ రావిపూడి టీవీ షోలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
జీ తెలుగు డ్రామా జూనియర్స్ షోలో అనిల్ రావిపూడి, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మదర్స్ డే సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ లోఅనిల్ రావిపూడి వాళ్ళ అమ్మ అనంత లక్ష్మి రావిపూడి వచ్చి సందడి చేసారు. తన కొడుకు సక్సెస్ అయినందుకు ఎమోషనల్ అయ్యాను అన్నారు. సుధీర్ మీద ఓ రెండు కామెడీ పంచులు కూడా వేశారు.
Also Read : Jabardasth Tanmay : జబర్దస్త్ లో మేము ముగ్గురమే అమ్మాయిలుగా మారింది.. తన్మయి కామెంట్స్.. ఎవరెవరంటే..?
సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తల్లి మొదటిసారి ఇలా టీవీ షోకి రావడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..