Hit 3 – Nidhi Singh : హిట్ 3 సినిమాలో నానితో ఫైట్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? తెలుగు యువత ప్రేమని చూసి ఆశ్చర్యపోతున్న నటి..

మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్ లో ఆ నటి అకౌంట్ దొరకడంతో అందరూ ఆమెని ఫాలో అవుతున్నారు.

Hit 3 – Nidhi Singh : హిట్ 3 సినిమాలో నానితో ఫైట్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? తెలుగు యువత ప్రేమని చూసి ఆశ్చర్యపోతున్న నటి..

Do You Know about HIT 3 Movie Lady Actress who Fight with Nani Here Details and Instagram Account

Updated On : May 6, 2025 / 2:01 PM IST

Hit 3 – Nidhi Singh : సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్ళు ఒక్క సినిమాతో వైరల్ అయిపోతారు. ఆ సినిమాతో వాళ్ళ స్టార్ డమ్ పెరిగిపోతుంది, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వస్తారు. అలా హిట్ 3 సినిమాలో ఓ అమ్మాయి ఇప్పుడు వైరల్ గా మారింది. హిట్ 3 సినిమాలో నానితో సెకండ్ హాఫ్ లో ఓ అమ్మాయి అదిరిపోయే ఫైట్ చేస్తుంది. ఆ అమ్మాయి క్యూట్ గా ఉండటం, బాగా ఫైట్ చేయడంతో తెలుగు యువత అంతా ఆ అమ్మాయి ఎవరా అని వెతకసాగారు.

మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్ లో ఆ నటి అకౌంట్ దొరకడంతో అందరూ ఆమెని ఫాలో అవుతున్నారు. ఆమె పేరు నిధి సింగ్. ముంబైకి చెందిన నటి, మోడల్. ఇప్పటికే పలు యాడ్స్ అయితే చేసిందని తెలుస్తుంది. తెలుగులో అయితే హిట్ 3నే మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also Read : Iavana – Dhoni : ధోని ఫస్ట్ సినిమాలో హీరోయిన్.. ధోని గురించి ఇవానా ఏం చెప్పిందంటే..

ఆ నటి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ దొరకడంతో ఆ నటిపై మీమ్స్ వేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. ఆమెని ఫాలో అవుతున్నారు. దీంతో తెలుగు యువత చూపిస్తున్న ప్రేమకు నిధి సింగ్ ఆశ్చర్యపోతుంది. తెలుగు మీమ్ పేజీలు వేసిన పలు పోస్ట్ లను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి థ్యాంక్స్ చెప్తూ, మనం చూపిస్తున్న ప్రేమకు ఆశ్చర్యపోతూ పోస్టులు పెడుతుంది.

View this post on Instagram

A post shared by Nidhi Singh (@menidhisingh)

 

ఆల్రెడీ హిట్ 3 షూటింగ్ సమయంలో దిగిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది నిధి. మొత్తానికి హిట్ 3 సినిమాలో నానితో ఫైట్ చేసి తెలుగు సోషల్ మీడియాలో వైరల్ గర్ల్ అయింది. తెలుగు సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తే ఇంకా హ్యాపీ.

Do You Know about HIT 3 Movie Lady Actress who Fight with Nani Here Details and Instagram Account

Also Read : Jabardasth Tanmay : వామ్మో.. జబర్దస్త్ తన్మయి ఇన్ని చదువులు చదివిందా? కానీ ఆ సమస్యల వల్ల..