Jabardasth Tanmay : వామ్మో.. జబర్దస్త్ తన్మయి ఇన్ని చదువులు చదివిందా? కానీ ఆ సమస్యల వల్ల..

తాజాగా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఛానల్ లో తన్మయి తన చదువు గురించి చెపింది.

Jabardasth Tanmay : వామ్మో.. జబర్దస్త్ తన్మయి ఇన్ని చదువులు చదివిందా? కానీ ఆ సమస్యల వల్ల..

Do You Know about Jabardasth Tanmay Study Details

Updated On : May 6, 2025 / 1:24 PM IST

Jabardasth Tanmay : చాలా మంది సినీ పరిశ్రమ సెలబ్రిటీలు ఎక్కువ చదువులు చదివిన వాళ్ళే ఉంటారు. అది వాళ్ళు చెప్పేదాకా ఎవ్వరికి తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదివి సినీ పరిశ్రమకు వచ్చినవాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. అలా జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న తన్మయి కూడా బాగానే చదువుకుంది. తాజాగా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఛానల్ లో తన్మయి తన చదువు గురించి చెపింది.

Also Read : Roja – Manchu Lakshmi : రోజా వర్సెస్ మంచు లక్ష్మి.. టీవీ షోలో రచ్చ.. ప్రోమో చూడాల్సిందే..

జబర్దస్త్ తన్మయి తన చదువు గురించి చెప్తూ.. గుంటూరు సెయింట్ మేరీస్ లో MBA చదివాను. అప్పుడే జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చింది. జబర్దస్త్, ఈవెంట్స్ చేసుకుంటూనే చదువుకున్నాను. నాకు ఫైనాన్షియల్ సమస్యలు ఉండటం వల్ల MBA ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు. మా ఇంట్లో సమస్యలు ఎక్కువ అవడంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చదవలేదు. అంతకుముందు కూడా నేను ఐపీసీసీ లో CPT ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేశాను. 200కు 194 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఆర్టికల్స్ చేయడానికి ఫీజ్ లేక ఆపేసాను. లేకపోతే CA అయ్యేదాన్ని. ఫ్యామిలీ కష్టాల వల్లే మొత్తం చదువు ఆపేసి కమర్షియల్ అయ్యాను. డబ్బులు వస్తున్నాయని జబర్దస్త్, ఈవెంట్స్ చేసుకుంటూ ఉండిపోయాను అని తెలిపింది.

Also Read : Lavanya Tripathi : ప్రగ్నెన్సీ అనౌన్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. క్యూట్ ఫోటో షేర్ చేసి వరుణ్, లావణ్య పోస్ట్..