Roja – Manchu Lakshmi : రోజా వర్సెస్ మంచు లక్ష్మి.. టీవీ షోలో రచ్చ.. ప్రోమో చూడాల్సిందే..
రోజా, మంచు లక్ష్మి సందడి చేసిన సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోమో చూసేయండి..

Image Credits : Zee Telugu
Roja – Manchu Lakshmi : రోజా ఇటీవల మళ్ళీ టీవీ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ లో జడ్జిగా అలరిస్తుంది. అలాగే సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో అప్పుడప్పుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తుంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రోజా, మంచు లక్ష్మి వచ్చి సందడి చేసారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు.
ఈ ప్రోమోలో రోజా, మంచు లక్ష్మి ఇద్దరూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. స్టేజిపైకి వచ్చాక రోజా.. ఎండాకాలంలో ఏదైనా మంచు ప్రదేశానికి వెళ్దాం అనుకున్నా ఇక్కడికి వచ్చేసా అని మంచు లక్ష్మికి కౌంటర్ ఇవ్వగా మంచు లక్ష్మి.. పోటీలో ఎవరైనా కంచు గా ఉంటె బాగుండు అనుకున్నా మీరు కలిశారు అని రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరూ కలిసి వాటర్ బోరింగ్ కొట్టే గేమ్ సరదాగా ఆడారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
Also Read : Lavanya Tripathi : ప్రగ్నెన్సీ అనౌన్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. క్యూట్ ఫోటో షేర్ చేసి వరుణ్, లావణ్య పోస్ట్..
మీరు కూడా రోజా, మంచు లక్ష్మి సందడి చేసిన సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోమో చూసేయండి..