Iavana – Dhoni : ధోని ఫస్ట్ సినిమాలో హీరోయిన్.. ధోని గురించి ఇవానా ఏం చెప్పిందంటే..
ఇవానా ఇప్పుడు శ్రీవిష్ణు సరసన సింగిల్ సినిమాలో నటించింది.

Actress Ivana Comments on Mahendra Singh Dhoni in Single Movie Promotions
Iavana – Dhoni : ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ లో ఎన్నో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ధోని నిర్మాతగా ఓ సినిమా కూడా తెరకెక్కించాడు. ధోని నిర్మాతగా తమిళ్ లో LGM అనే సినిమాని తెరకెక్కించాడు. 2023లో ఈ సినిమా రిలీజయింది. ఈ సినిమాలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటించింది.
ఇవానా ఇప్పుడు శ్రీవిష్ణు సరసన సింగిల్ సినిమాలో నటించింది. ఈ సినిమా మే 9 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇవానా ధోని గురించి మాట్లాడింది.
Also Read : Jabardasth Tanmay : వామ్మో.. జబర్దస్త్ తన్మయి ఇన్ని చదువులు చదివిందా? కానీ ఆ సమస్యల వల్ల..
ఇవానా మాట్లాడుతూ.. నేను స్పోర్ట్స్ ఎక్కువగా చూడను. కానీ ధోని సర్ ని రెస్పెక్ట్ చేస్తాను. ధోని సర్ సినిమాల్లోకి వస్తారని అనుకోలేదు. ఆయన నిర్మాతగా ఫస్ట్ సినిమాలో నేను హీరోయిన్ అవ్వడం చాలా అదృష్టం. తల ఫస్ట్ హీరోయిన్ నేనే అని ఒక హ్యాపినెస్ ఉంది. ఆయనతో నేను ఫొటోలు దిగాను. ధోని సర్ ని కలిసినప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలో నాకు కొంచెం భయం వేసింది. ఆయనే నా దగ్గరకు వచ్చి నేను బాగా చేసాను, బాగా నటించాను అని సినిమాలో సీన్స్ గురించి చెప్పి అభినందించారు. చాలా మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చింది.
Also Read : Lavanya Tripathi : ప్రగ్నెన్సీ అనౌన్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. క్యూట్ ఫోటో షేర్ చేసి వరుణ్, లావణ్య పోస్ట్..