Anil Ravipudi Next Movie Planning after Bhagavanth Kesari
Anil Ravipudi : టాలీవు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇన్నాళ్లు తనకు సక్సెస్ ఇచ్చిన కామెడీ జోనర్ ని కొంచెం పక్కనపెట్టి ఈసారి బాలకృష్ణతో(Balakrishna) ఎమోషనల్, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి కూడా భారీ హిట్ సాధించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో తెరకెక్కిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) ఇటీవల దసరాకు వచ్చి భారీ విజయం సాధించి 130 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించింది.
బాలయ్య నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల(Sreeleela) చేతిలో ఫుల్ గా సినిమాలు ఉన్నాయి. మరి డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి అని ఇప్పుడు ప్రశ్నగా మారింది. అనిల్ రావిపూడి ఇప్పటిదాకా ఇంకో సినిమా ప్రకటించలేదు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాలు మాత్రం కొంచెం డిఫెరెంట్ గా ఉంటాయని చెప్పాడు.
అయితే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా రవితేజతో(Raviteja) ఉండొచ్చు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. రవితేజ ప్రస్తుతం సంక్రాంతికి ఈగల్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఉంది. దాని తర్వాత ఇంకా ఏ సినిమా ఓకే చేయకపోయినా తనతో సినిమా ఉంటుందని హరీష్ శంకర్ ప్రకటించారు. అయితే హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా మొదలుపెట్టడు. దీంతో అనిల్ రావిపూడి ఒక కథతో రవితేజని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. దీంతో రవితేజ అనిల్ రావిపూడి కాంబోలో మళ్ళీ సినిమా ఉండొచ్చని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబోలో రాజా ది గ్రేట్ సినిమా వచ్చి మంచి విజయం సాధించింది.