Suriya : లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్.. సూర్య 2009లోనే మొదలుపెట్టేశాడా? LCU క్యారెక్టర్స్ అన్నీ ఆ సినిమాలో..
ఖైదీ, విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన లోకేష్ ఇటీవల విజయ్ లియో(Leo) సినిమాతో కూడా మంచి విజయం సాధించాడు. ఈ మూడు సినిమాలకు లింక్స్ పెట్టి, ఆ తర్వాత వచ్చే సినిమాలకు కూడా లింక్స్ ఉన్నట్టు చెప్పి రాబోయే సినిమాలపై ఇప్పట్నుంచే అంచనాలు పెంచేసాడు లోకేష్.

Lokesh Kanagaraj Cinematic Universe Reference From Suriya Movie Video goes Viral
Suriya : ప్రస్తుతం సౌత్ లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). తమిళ్ లో తీసిన 5 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తన సినిమాలకు ఒకదానికి ఒకటి లింక్ పెడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని తన సినిమాలపై ప్రేక్షకులకు అంచనాలు పెంచేశాడు. లోకేష్ సినిమా వస్తుంది అంటే ఈ సారి ఏం కొత్తగా ఉంటుందా? ఏ హీరో స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఖైదీ, విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన లోకేష్ ఇటీవల విజయ్ లియో(Leo) సినిమాతో కూడా మంచి విజయం సాధించాడు. ఈ మూడు సినిమాలకు లింక్స్ పెట్టి, ఆ తర్వాత వచ్చే సినిమాలకు కూడా లింక్స్ ఉన్నట్టు చెప్పి రాబోయే సినిమాలపై ఇప్పట్నుంచే అంచనాలు పెంచేసాడు లోకేష్. అయితే LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)లోని క్యారెక్టర్స్ అన్నీ సూర్య 2009 లోనే తన సినిమాలో చూపించేసాడట.
2009 లో KV ఆనంద్ దర్శకత్వంలో సూర్య, తమన్నా జంటగా తమిళ్ లో ‘అయాన్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘వీడోక్కడే’ పేరుతో రిలీజయింది. రెండుచోట్ల ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కథాంశంలో కూడా డ్రగ్స్ ని అమ్మేవాళ్ళని పట్టుకోవడం, డ్రగ్స్ నాశనం చేయడం అనే పాయింట్ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ సినిమాల్లో కూడా మెయిన్ పాయింట్ డ్రగ్స్ నాశనం చేయడమే. ఇక వీడోక్కడే సినిమాలో దాస్ అండ్ కో, ఢిల్లీ, పార్తీబన్.. అనే పేర్లతో క్యారెక్టర్స్ ఉంటాయి. అవే పేర్లతో క్యారెక్టర్లు అన్నీ లోకేష్ సినిమాల్లో కూడా ఉన్నాయి. అలాగే సూర్య ఇందులో డ్రగ్స్ పట్టుకోవడంలో పోలీసులకు సహాయం చేస్తూ ఉంటాడు. విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ లో డ్రగ్స్ డీలర్ గానే కనిపిస్తాడు.
Also Read : Varshini Sounderajan : తిరుమలలో యాంకర్ వర్షిణి.. ఆలయం బయట ఫొటోలు షేర్ చేస్తూ..
దీంతో ప్రస్తుతం వీడోక్కడే సినిమా వైరల్ గా మారింది. ఈ సినిమాని LCU కి కనెక్ట్ చేస్తూ ఓ వీడియో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీంతో లోకేష్ ఈ సినిమా నుంచే కథలు రాసుకున్నాడా? లేకపోతే ఏ ఈసినిమాకి ఏమైనా పనిచేశాడా? సూర్య సినిమాల్లో భవిష్యత్తులో జరిగేవి ముందే చెప్పేస్తాడు గతంలోలాగే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి లోకేష్ కనగరాజ్ సినిమాలకు మాత్రం పబ్లిసిటీ లేకుండానే ఫుల్ హైప్ వస్తుంది.