Varshini Sounderajan : తిరుమలలో యాంకర్ వర్షిణి.. ఆలయం బయట ఫొటోలు షేర్ చేస్తూ..
యాంకర్ గా మంచి పేరు, ఫామ్ తెచ్చుకున్న వర్షిణి ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాలో హీరోయిన్స్ గా చేస్తూ, పలు టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తుంది.

Varshini Sounderajan Visited Tirumala Temple
Varshini Sounderajan : పలు షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన వర్షిణి తర్వాత యాంకర్ గా కూడా మారింది. యాంకర్ గా మంచి పేరు, ఫామ్ తెచ్చుకున్న వర్షిణి ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాలో హీరోయిన్స్ గా చేస్తూ, పలు టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను, ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది వర్షిణి.
Also Read : Pragathi : చీరలో ప్రగతి జిమ్ వీడియో చూశారా? 90 కిలోలు ఈజీగా మూసేస్తూ..
తాజాగా యాంకర్ వర్షిణి తిరుమలకు వెళ్ళింది. సోమవారం నాడు తిరుమలకు వెళ్లిన వర్షిణి వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఆలయం బయట ఫొటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు షేర్ చేసి.. చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపింది. దీంతో తిరుమలలో వర్షిణి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.