×
Ad

Anil Sunkara : నారీ నారీ నడుమ మురారి సక్సెస్ తర్వాత.. ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్ తో నిర్మాత అనిల్ సుంకర..

ఈ సినిమా తర్వాత అనిల్ సుంకర నెక్స్ట్ సినిమాపై ఆసక్తి నెలకొంది. (Anil Sunkara)

Anil Sunkara

Anil Sunkara : నిర్మాత అనిల్ సుంకర ఇటీవల శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి సినిమా తెరకెక్కించి సంక్రాంతికి రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. ఈ సినిమా తర్వాత అనిల్ సుంకర నెక్స్ట్ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇటీవల అనిల్ సుంకర మూవీ మేకింగ్ రియాలిటీ షో అంటూ ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అని ప్రకటించి కొత్తవాళ్లకు అవకాశాలు అని తెలిపారు.(Anil Sunkara)

దీంట్లో భాగంగానే అనిల్ సుంకర ఏటీవీ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై కొత్త నటీనటులతో ‘ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. విజయవాడ నేపథ్యంగా నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలో జరిగిన సంఘటనలు, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో కష్టాలు, ప్రతికూల పరిస్థితులను అధిగమించి చివరికి ఎలా సక్సెస్ అయ్యారు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Also See : Chiranjeevi : మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను కలిసి మరీ అభినందించిన మెగాస్టార్.. ఫొటోలు..

సినిమాకు తగ్గట్టు ప్రమోషన్స్ కూడా అలాగే చేస్తున్నారు. విజయవాడలో.. అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు అంటూ సరదాగా బ్యానర్ వేసి ‘ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్’ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.

సంక్రాంతికి సక్సెస్ కొట్టిన అనిల్ సుంకర కొత్తవాళ్లతో త్వరలో ఈ సినిమాతో రాబోతున్నారు.

 

Also Read : Sudigali Sudheer : ఎట్టకేలకు ప్రమోషన్స్ కి వచ్చిన సుడిగాలి సుధీర్.. గోట్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్..