Sudigali Sudheer : ఎట్టకేలకు ప్రమోషన్స్ కి వచ్చిన సుడిగాలి సుధీర్.. గోట్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్..

నేడు సుడిగాలి సుధీర్ ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. (Sudigali Sudheer)

Sudigali Sudheer : ఎట్టకేలకు ప్రమోషన్స్ కి వచ్చిన సుడిగాలి సుధీర్.. గోట్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్..

Sudigali Sudheer

Updated On : January 26, 2026 / 6:39 PM IST

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా తెరకెక్కుతున్న సినిమా G.O.A.T(గోట్) గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ట్యాగ్ లైన్. మహాతేజ క్రియేషన్స్, జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్స్ పై చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణంలో వేదవ్యాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ ని రిలీజ్ చేరేశారు.(Sudigali Sudheer)

తాజాగా ఈ సినిమా నుంచి ‘రైజ్‌ ఆఫ్‌ గణ..’ అనే లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. లియోన్‌ జేమ్స్‌ సంగీత దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ రాయగా వినోద్ ఏలుమలై ఈ పాటను పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

 

Also See : Raviteja : ‘ఇరుముడి’ సెట్ లో రవితేజ బర్త్ డే సెలబ్రేషన్స్.. మెడలో అయ్యప్ప మాలలతో రవితేజ..

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో గతంలో సుడిగాలి సుధీర్ పాల్గొనలేదు. దర్శకుడికి మూవీ టీమ్ కి వివాదం అవడంతో సుధీర్ కూడా సైలెంట్ అయ్యాడు. దీంతో సుధీర్ ప్రమోషన్స్ కి రాకపోవడం చర్చగా మారింది. కానీ నేడు సుడిగాలి సుధీర్ ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఓ ఇంజనీరింగ్‌ కళాళాలలో జరిగిన ఈవెంట్‌లో ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కి సుధీర్, దివ్యభారతి, మూవీ టీమ్ హాజరయి సందడి చేసారు. దీంతి సింధీర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఈవెంట్లో నిర్మాత మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ సినిమా మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. అని అన్నారు.

Also Read : Amardeep : సోహెల్ కి కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్..? బిగ్ బాస్ దేనికి పనికి రాదు అంటూ..