Amardeep : సోహెల్ కి కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్..? బిగ్ బాస్ దేనికి పనికి రాదు అంటూ..
ఓ ఇంటర్వ్యూలో అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా ఇవి బిగ్ బాస్ ఫేమ్, నటుడు సయ్యద్ సోహెల్ కి కౌంటర్ అని అంటున్నారు నెటిజన్లు. (Amardeep)
Amardeep
Amardeep : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది సినిమాల్లో హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిద్దాం అని కలలు కంటారు. కానీ అందులో కొంతమందే సక్సెస్ అవుతారు. సీరియల్ నటుడు, బిగ్ బాస్ 7 రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అమర్ దీప్ హీరోగా నటించిన సుమతి శతకం త్వరలో రిలీజ్ కానుంది.(Amardeep)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా ఇవి బిగ్ బాస్ ఫేమ్, నటుడు సయ్యద్ సోహెల్ కి కౌంటర్ అని అంటున్నారు నెటిజన్లు.
అమర్ దీప్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో ఓట్లు వేశారు కదా అని మన సినిమాకు థియేటర్ కి వస్తారు అని ఊహించి సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసుకొని సినిమాకు రప్పించాలి కానీ బిగ్ బాస్ ఓట్లు సినిమాలకు పనికిరావు. బిగ్ బాస్ లో నువ్వు విన్నర్ అయినా , సెకండ్ ప్లేస్ అయినా, ఏ ప్లేస్ లో వచ్చినా అది ఒక రోజు మాత్రమే. ఈవెంట్లు చేసుకో, ఓపెనింగ్స్ చేసుకో, స్టేజి షోలకు వెళ్తాము అంతే కానీ బిగ్ బాస్ దేనికి పనికి రాదు. అక్కడొచ్చిన పేరుని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. లేట్ అయినా సక్సెస్ వస్తుంది ఓపిక పట్టాలి అని అన్నాడు.
అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం సోహెల్ హీరోగా, నిర్మాతగా తెరకేకించిన బూట్ కట్ బాలరాజు అనే సినిమా ఫ్లాప్ అవ్వగా కెమెరా ముందుకొచ్చి.. బిగ్ బాస్ లో ఓట్లు వేశారు కదరా ఎక్కడరా మీరంతా సినిమాకు రాలేదు అంటూ ఏడ్చాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అవ్వగా సోహెల్ పై విమర్శలు కూడా వచ్చాయి.
Also Read : Anudeep : స్కూల్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా.. నా జీవితంలో పెళ్లి లేదు.. అనుదీప్ లవ్ స్టోరీ తెలుసా?
దీంతో ఇప్పుడు అమర్ దీప్ మాట్లాడిన వ్యాఖ్యలు సోహెల్ కి కౌంటర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అమర్ దీప్ కానీ, సోహెల్ కానీ స్పందిస్తారేమో చూడాలి.
