Sandeep Vanga : సందీప్ వంగ సినిమాలపై అమీర్ ఖాన్ మాజీ భార్య కామెంట్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన సందీప్ వంగ..

అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఓ ఇంటర్వ్యూలో.. కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలు స్త్రీలపై ద్వేషం, వేధింపులని ప్రోత్సహించేలా ఉన్నాయి అని అనడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Sandeep Vanga : సందీప్ వంగ సినిమాలపై అమీర్ ఖాన్ మాజీ భార్య కామెంట్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన సందీప్ వంగ..

Animal Director Sandeep Reddy Vanga Strong Reply to Aamir Khan Ex Wife Kiran Rao Comments on his Movies

Updated On : February 3, 2024 / 2:56 PM IST

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ చేసిన మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్(Animal) సినిమాలతోనే భారీ హిట్స్ కొట్టి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు లైన్లో పెట్టాడు. అయితే సందీప్ వంగ సినిమాల్లో అడల్ట్ కంటెంట్, వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని పలువురు విమర్శలు చేస్తూ ఉంటారు. సందీప్ అలాంటి విమర్శలని పట్టించుకోకుండా తనకి నచ్చిన రీతిలోనే సినిమాలు తీస్తాడు.

కానీ సందీప్ పై వచ్చే విమర్శలకు మాత్రం ఒక్కోసారి గట్టి కౌంటర్ ఇస్తాడు. ఇటీవల అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఓ ఇంటర్వ్యూలో.. కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలు స్త్రీలపై ద్వేషం, వేధింపులని ప్రోత్సహించేలా ఉన్నాయి అని అనడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు తెలియచేస్తున్నారు.

Also Read : Poonam Kaur : పూనమ్ కౌర్ ఆ వ్యాధితో బాధపడుతుందా? బట్టలు వేసుకోడానికి కూడా పెయిన్స్..

అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. సందీప్ మాట్లాడుతూ.. ఆమె అన్న మాటలు నేను కూడా విన్నాను. ఆమెకి నేను ఒకటే చెప్తా. అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాలో ఒక నటిపై దారుణమైన సీన్స్ తీశారు. తనని అత్యాచారం చేయాలనుకున్న వ్యక్తితోనే ప్రేమలో పడినట్లు చూపారు. ఇలాంటివి చాలా సినిమాల్లో చాలా ఉన్నాయి. ముందు వాటి గురించి తెలుసుకోండి. తర్వాత నా సినిమాలని ప్రశ్నించండి అని అన్నాడు. దీంతో సందీప్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై కిరణ్ రావు స్పందిస్తుందేమో చూడాలి.