Poonam Kaur : పూనమ్ కౌర్ ఆ వ్యాధితో బాధపడుతోందా? బట్టలు వేసుకోడానికి కూడా పెయిన్స్..

ప్రముఖ నేచురోపతి డా.మంతెనతో కలిసి ఓ ప్రోగ్రాం కోసం ఇంటర్వ్యూ ఇచ్చింది పూనమ్ కౌర్.

Poonam Kaur : పూనమ్ కౌర్ ఆ వ్యాధితో బాధపడుతోందా? బట్టలు వేసుకోడానికి కూడా పెయిన్స్..

Poonam Kaur Effected with fibromyalgia Disease and Treatment Full Details Here

Updated On : February 3, 2024 / 3:27 PM IST

Poonam Kaur : పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించిన పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ వర్క్స్, రాజకీయాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు సమస్యలపై స్పందిస్తుంది పూనమ్ కౌర్. తాజాగా తనకి ఓ వ్యాధి వచ్చినట్టు తెలిపింది.

ప్రముఖ నేచురోపతి డా.మంతెనతో కలిసి ఓ ప్రోగ్రాం కోసం ఇంటర్వ్యూ ఇచ్చింది పూనమ్ కౌర్. ఈ ఇంటర్వ్యూలో.. తనకి ఫైబ్రోమైయాల్జియా అనే వైద్యం కోసం మంతెన గారి దగ్గరికి వచ్చాను. ఆ వ్యాధి వల్ల బట్టలు వేసుకోడానికి కూడా పెయిన్స్ వచ్చాయి. బాడీలో మూవ్ మెంట్స్ ఈజీగా ఉండవు. లూజ్ బట్టలు వేసుకోవాలి. 2 ఇయర్స్ చాలా బాధపడ్డాను. ఈ సమస్యకు వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు అమూల్యం అని తెలిపింది పూనమ్ కౌర్.

Also Read : RK Sagar : మొగలిరేకులు ఆర్కే నాయుడు హీరోగా మరో సినిమా.. ఈసారి ‘ద 100’ అంటూ..

ఫైబ్రోమైయాల్జియా అంటే శరీరంలోని కండరాలు పట్టేయడం, అవి కదిలిస్తే నొప్పులు రావడం లాంటిది. దీనివల్ల బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో పూనమ్ కౌర్ కొన్నాళ్ళు బాధపడినట్లు తెలుస్తుంది. ఆమె సినిమాలకు దూరం అవ్వడానికి ఇది కూడా ఒక కారణం ఏమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సమస్య తనకి మంతెన వద్ద తీసుకున్న వైద్యంతో తగ్గిందని తెలిపింది. దీంతో పూనమ్ కౌర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.