RK Sagar : మొగలిరేకులు ఆర్కే నాయుడు హీరోగా మరో సినిమా.. ఈసారి ‘ద 100’ అంటూ..
మొగలిరేకులు సీరియల్ తో ఆర్కే నాయుడు ఇప్పుడు హీరోగా మరో సినిమాతో రాబోతున్నాడు.

Mogalirekulu Serial Fame RK Sagar coming with The 100 Movie
RK Sagar Movie : సీరియల్స్ తో పరిశ్రమకు పరిచయమైన సాగర్ పలు సీరియల్స్ లో నటించి మొగలిరేకులు(Mogalirekulu) సీరియల్ తో ఆర్కే నాయుడుగా బాగా పాపులర్ అయ్యాడు. ఆ సీరియల్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి సిద్దార్థ, షాదీ ముబారక్ సినిమాలతో ప్రేక్షకులని పలకరించాడు. ఇప్పుడు హీరోగా మరో సినిమాతో రాబోతున్నాడు సాగర్.
పలు ఇండిపెండెంట్ సినిమాలతో అవార్డులు గెలుచుకున్న రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘ద 100’ అనే ఆసక్తికర టైటిల్ ని ఈ సినిమాకు ప్రకటించారు. ఈ సినిమాలో విక్రాంత్ అనే ఐపిఎస్ ఆఫీసర్ పాత్రలో సాగర్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ పోలీస్ యాక్షన్ కథతో ఈ సినిమా రాబోతుంది.
Also Read : Yatra 2 Trailer : యాత్ర 2 ట్రైలర్ చూశారా? శత్రువులకు తల వంచరు..
ఈ సినిమాకి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా అర్జున్ రెడ్డి, యానిమల్.. లాంటి సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.