Animal Director Sandeep Vanga and Srikanth Odela met Megastar Chiranjeevi Photo goes Viral
Sandeep Vanga – Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పలువురు ప్రముఖులు నిన్నటి నుంచి చిరంజీవిని కలిసి సత్కరించి అభినందిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు చిరంజీవిని కలిసి అభినందించగా నేడు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ మెగాస్టార్ ని కలిసి అభినందించారు.
సందీప్ వంగతో పాటు దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా వెళ్లి చిరంజీవిని అభినందించారు. అనంతరం కాసేపు చిరుతో ముచ్చటించారు. చిరంజీవికి సందీప్ వంగ కలిసిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. గతంలో చాలా సార్లు సందీప్ వంగ మెగాస్టార్ కి వీరాభిమాని అని చెప్పిన సంగతి తెలిసిందే. చిరంజీవి పాత సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగ మాట్లాడిన మాటలు విని ఇంత పిచ్చి అభిమాని ఏంట్రా అని కూడా అంతా అనుకున్నారు.
Also Read : మెగాస్టార్ కోసం ఇండస్ట్రీ అంతా ఒకేచోటకి చేరబోతుందా? దిల్ రాజు ఏమన్నారంటే..?
అప్పుడే సందీప్ వంగ చిరంజీవితో సినిమా తీయాలి. చిరంజీవి గారు ఛాన్స్ ఇస్తే అదిరిపోయే మాస్ సినిమా తీస్తాను అని చెప్పాడు. ఇప్పటికే సందీప్ వంగ తీసిన మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, బాలీవుడ్ ని దున్నేస్తున్నాడు, పాన్ ఇండియా వైడ్ తన సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవిని కలవడంతో సినిమా గురించి మాట్లాడాడా? వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా? సినిమా ఉంటే బాగుండు అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ వంగ – మెగాస్టార్ కలిస్తే ఆ సినిమా కచ్చితంగా బాస్ లోని కొత్త మాస్ ని చూపిస్తుంది అని భావిస్తున్నారు. మరి వీళ్ళ కాంబోలో ప్రాజెక్టు సెట్ అవుతుందో లేదో తెలీదు కానీ ఈ ఫోటో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.
Sensational director @imvangasandeep and Blockbuster director #SrikanthOdela met #PadmaVibhushanChiranjeevi garu at his residence and conveyed their heartfelt wishes to him for the prestigious #PadmaVibhushan @KChiruTweets #SandeepReddyVanga pic.twitter.com/Le7XUs7mrn
— idlebrain.com (@idlebraindotcom) January 27, 2024
ఇక ఇదే రోజు యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా చిరంజీవిని కలిసి అభినందించారు. చిరంజీవికి ఓ హనుమంతుడి విగ్రహం కూడా బహూకరించాడు కిరణ్ అబ్బవరం.
With One and Only Boss ?❤️#PadmaVibhusanChiranjeevi #MegastarChiranjeevi pic.twitter.com/AcAmembeD9
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 27, 2024