×
Ad

Animal Movie : యానిమల్ మూవీలో చూపించిన.. భారీ మెషిన్ గన్‌ని నిజంగా తయారు చేశారు

యానిమల్ మూవీలో చూపించిన భారీ మెషిన్ గన్‌ని నిజంగా తయారు చేశారని సినిమా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ తెలియజేశారు. దాదాపు నాలుగు నెలలు కష్టపడి..

  • Published On : November 27, 2023 / 03:13 PM IST

Animal Movie art director said machine gun showed in trailer is not vfx

Animal Movie : సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. అండర్ వరల్డ్ డాన్ ప్లస్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. దీంతో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా ట్రైలర్ లో ఒక సీన్ యాక్షన్ మూవీ లవర్స్ ని ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ఆ సీన్ లో రణబీర్ ఒక భారీ మెషిన్ గన్ తో ఫైర్ చేస్తూ ఉన్నారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందో అని అందరూ అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక ఆ మెషిన్ గన్ చూసి చాలా మంది దానిని VFX ద్వారా క్రియేట్ చేశారని అనుకున్నారు. కానీ దానిని నిజంగా తయారు చేశారట. దాదాపు నాలుగు నెలలు కష్టపడి స్టీల్ తో ఆ మెషిన్ గన్ ని తయారు చేశారట. ఈ విషయాన్ని యానిమల్ మూవీ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ తెలియజేశారు. ఆ మెషిన్ గన్ పూర్తి బరువు 500 కేజీలు అని వెల్లడించారు.

Also read : Allu Arjun : అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నటి.. ఇప్పుడేం చేస్తోందంటే?

రణబీర్ కూడా ఈ సీన్ గురించి మాట్లాడుతూ.. సందీప్ వంగా ఈ సీన్ చెప్పినప్పుడు చాలా ఎక్స్‌జైట్ ఫీల్ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. ఆ సీన్ చాలా బాగా వచ్చిందని తెలియజేశారు. ఇక అది VFX కాదని తెలియడంతో ఆడియన్స్ లో మూవీ పై మరింత ఆసక్తి పెరిగింది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో జరగబోతుంది. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరుకాబోతున్నారు. డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.