Anirudh Ravichander: టాలీవుడ్‌లో అనిరుద్ సెకండ్ ఇన్నింగ్స్.. సెన్సేషన్ అవుతాడా?

టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నాడు అనిరుధ్ రవిచందర్. క్యాచ్ చేసిన బిగ్ స్టార్స్ సినిమాలతో తెలుగులో స్టార్ డం తెచ్చుకోవాలనేది ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లాన్. దేవీశ్రీ, తమన్..

Anirudh Ravichander

Anirudh Ravichander: టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నాడు అనిరుధ్ రవిచందర్. క్యాచ్ చేసిన బిగ్ స్టార్స్ సినిమాలతో తెలుగులో స్టార్ డం తెచ్చుకోవాలనేది ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లాన్. దేవీశ్రీ, తమన్ తర్వాత ఆ రేంజ్ లో ఇక్కడ జెండా పాతాలనుకుంటోన్న అనిరుథ్ ని.. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్టర్ నేటివ్ అనుకుంటుందా.. ఈ యంగ్ సెన్సేషన్ మ్యూజిక్.. మ్యాజిక్ చేయడం ఖాయమేనా..?

Jr NTR-Mahesh Babu : సర్కారు వారి పాట షర్ట్స్.. జూనియర్ ఎన్టీఆర్ జీన్స్..

బీస్ట్ మూవీలోని అరబిక్ కుతు.. ప్రజెంట్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఈ పాటను కంపోజ్ చేసిన అనిరుథ్ రవిచందర్ అంతే పాపులారిటీ సంపాదిస్తూ కోలీవుడ్ ను దున్నేస్తున్నాడు. అయితే ఇప్పుడీ మ్యూజిక్ డైరెక్టర్ కన్ను టాలీవుడ్ పై పడింది. బిగ్ స్టార్స్ సినిమాల్లో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తున్నాడు. ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా షురూ చేయబోతున్నాడు. గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి సినిమాలు చేసినా.. సాలిడ్ హిట్ మాత్రం అనిరుథ్ కి దక్కలేదు.

MEGA154: హీరోయిన్ దొరికేసినట్లే.. మెగాస్టార్ జోడీగా నివేదా?

తమిళ్ లో బిగ్ స్టార్స్ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయంటే మాక్సిమమ్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్ పేరే వినిపిస్తోంది. బీస్ట్, విక్రమ్, తిరుచిత్రాంబలం, ఇండియన్2, రజనీకాంత్ 169 ఇలా చేతిలో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక తెలుగులో ఆ రేంజ్ చూపించాలనుకుంటోన్న అనిరుథ్ సూపర్ లిస్ట్ రెడీ చేస్తున్నాడు. ఎన్టీఆర్-కొరటాల శివ, విజయ్ దేవరకొండ-శివనిర్వాణ, రామ్ చరణ్-గౌతమ్ తిన్ననూరి వంటి క్రేజీ కాంబోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు.

Pushpa: పుష్ప-2‌తో హాట్ టాపిక్‌గా మారిన ఇంద్రజ!

తెలుగులో ప్రస్తుతం మ్యూజిక్ హవా అంటే దేవీశ్రప్రసాద్, తమన్ లది మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. వీళ్లు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మణిశర్మ లాంటి సీనియర్స్ కి ఆచార్య వంటి ఛాన్స్ వచ్చినా.. దానిని ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడుకోలేకపోతున్నారు. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆల్టర్ నేటివ్ కోసం చూస్తోంది. అందులో భాగంగానే కొలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్.. ఇక్కడ పాగా వేయాలనుకుంటున్నాడు. హై ఇంటెన్స్ పాన్ ఇండియా ప్రాజెక్టులను వరుసగా తన అకౌంట్ లో వేసుకుంటున్నాడు.