Anjali Bahishkarana Trailer out now
Bahishkarana Trailer : తెలుగు నటి అంజలి యాభైకి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించింది. బహిష్కరణ అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో ఈ సిరీస్ రూపొందింది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి.
జూలై 19 నుంచి జీ5లో బహిష్కరణ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ‘మంచోడు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా..? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడమే..’ ‘మనసు ఏమంటుంది అయ్యా.. ఇంకా కొత్త రుచులను కోరుకుంటుంది.’ అనే డైలాగ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.
Bharateeyudu 2 : భారతీయుడు-2 టికెట్ ధరల పెంపు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
ప్రశాంతంగా ఉండే పల్లెటూరుకి అంజలి ఎందుకు ఎందుకు వచ్చింది. ఆమెకు అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? ఆమె ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.. ఎందుకు? అనే విషయాలు తెలియాలంటే జూలై 19 వరకు ఆగాల్సిందే.