Bharateeyudu 2 : భార‌తీయుడు-2 టికెట్ ధ‌ర‌ల పెంపు.. తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌..

లోక‌నాయకుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన‌ చిత్రం ఇండియన్ 2 (భార‌తీయుడు2).

Bharateeyudu 2 : భార‌తీయుడు-2 టికెట్ ధ‌ర‌ల పెంపు.. తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌..

Telangana govt green signal to Bharateeyudu 2 movie to hike ticket prices

Updated On : July 10, 2024 / 8:03 PM IST

Bharateeyudu 2 : లోక‌నాయకుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన‌ చిత్రం ఇండియన్ 2 (భార‌తీయుడు2). శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కాజ‌ల్ అగ‌ర్వాల్, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, బాబీ సింహా, స‌ముద్ర ఖ‌ని లు కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందానికి తెలంగాణ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది.

టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. అంతేకాదండోయ్ స్పెష‌ల్ షోలు వేసుకునేందుకు వెసులుబాటు క‌ల్పించింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ స్ర్కీన్స్‌లో రూ.50, మ‌ల్టీప్లెక్స్‌ల్లో రూ.75 చొప్పున టికెట్ పై ఏడు రోజుల పాటు పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.

Also Read : ‘తంగ‌లాన్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. విక్ర‌మ్ న‌ట‌న నెక్ట్స్ లెవల్‌..

ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్‌ నియంత్రణ కోసం అవగాహన కల్పించేలా వీడియోను త‌యారు చేసి ఇవ్వాల‌ని సినీ ప‌రిశ్ర‌మ‌ను కోరారు. అందులో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని లు యాంటీ డ్ర‌గ్స్ పై ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ క్ర‌మంలోనే టికెట్ల ధ‌ర‌ల‌ పెంపుతో పాటు బెనిఫిట్ షో వేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లుగా తెలుస్తోంది.