Love Jathara
Love Jathara : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన అంకిత్ కొయ్య ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, బ్యూటీ.. సినిమాలతో హీరోగా మెప్పించాడు. ఇప్పుడు కొత్త సంవత్సరం హీరోగా మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు అంకిత్ కొయ్య.(Love Jathara)
అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా యూజీ క్రియేషన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మాణంలో న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. సమ్మతమే ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘లవ్ జాతర’ అనే టైటిల్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని మూవీ టీమ్ తెలిపింది.