AnnapurnaStudios : అమ్మమ్మను గుర్తు చేసుకున్న సుమంత్

  • Publish Date - August 13, 2020 / 11:08 AM IST

హీరో సుమంత్ తన అమ్మమ్మ అక్కినేని అన్నపూర్ణను గుర్తు చేసుకున్నారు. 2020, ఆగస్టు 13వ తేదీ బుధవారం ఆమె జయంతి. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా…సుమంత్ ఓ ట్వీట్ చేశారు.

‘నా అమ్మమ్మ/ అమ్మ అన్నపూర్ణ జయంతి ఈరోజు’ అంటూ అమ్మమ్మపై తనకు ఉన్న ప్రేమను ప్రేమను వ్యక్తం చేశాడు. ఫొటోలో చిన్నారి సుమంత్, అన్నపూర్ణ ఉన్నారు. 1975, ఆగస్టు 13వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. శంకుస్థాపన సందర్భంగా చిన్నారి సుమంత్ తో మొదటి ఇటుకను అన్నపూర్ణ పెట్టిస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడి నిలదొక్కుకొనడానికి అక్కినేని నాగేశ్వర్రావు (ANR) క్రియాశీలక పాత్ర పోషించారు. 1960 ప్రారంభంలో హైదరాబాద్ లో సినిమా రూపొందించాంటే అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. దక్షిణాది భాషల సినీ పరిశ్రమకు మద్రాసు ప్రధాన కేంద్రంగా ఉండేదన్న సంగతి తెలిసిందే.

మద్రాసులోని స్టూడియోలన్ని బిజీగా ఉండేవి. అందరూ మద్రాసులో అందుబాటులో ఉండేవారు. తమిళం, తెలుగులో ఏకకాలంలో సినిమాలను నిర్మించేవారు. తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు రప్పించడంలో అక్కినేని చొరవ తీసుకున్నారు.

సారథి స్టూడియో కంటే ముందు నిజాం హయాంలో నిర్మించిన స్టూడియో ఒకటి పాతబస్తీ ఫలక్‌నుమా ప్రాంతంలో ఉండేది. 1975లో అప్పటి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో హైదరాబాద్, బంజారాహిల్స్‌లో 22 ఎకరాల స్థలంలో ఆగస్టు 13న అక్కినేని మనవడు యార్లగడ్డ సుమంత్ అన్నపూర్ణ స్టూడియోకు శంకుస్థాపన చేశారు.

1976 జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫకృద్దిన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోను ప్రారంభించారు. ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, సహ నిర్మాత డి.రామానాయుడు, వాణిశ్రీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు రప్పించడంలో అక్కినేని చొరవ తీసుకుంటే,…దాన్ని ముందుకు తీసుకువెళ్లిన వారు రామారావు. సారథి స్టూడియో కంటే ముందు నిజాం హయాంలో నిర్మించిన స్టూడియో ఒకటి పాతబస్తీ ఫలక్‌నుమా ప్రాంతంలో ఉండేది.

ఆ తర్వాత 1975లో అప్పటి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో హైదరాబాద్, బంజారాహిల్స్‌లో 22 ఎకరాల స్థలంలో ఆగష్టు 13న అక్కినేని మనవడు యార్లగడ్డ సుమంత్ అన్నపూర్ణ స్టూడియోకు శంకుస్థాపన చేశారు. 1976 జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫకృద్దిన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోను ప్రారంభించారు.

ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కూడా హారజరయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, సహననిర్మాత డి.రామానాయుడు, వాణిశ్రీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాళ్లు, గుట్టలతో అడవిని తలపించేలా ఉండే ఈ ప్రాంతంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను నిర్మించడం విశేషం. భార్య అన్నపూర్ణ, కుమారులు అక్కినేని వెంకట్, నాగార్జునల ప్రోత్సాహంతో స్టూడియోను నిర్మించారు.

ట్రెండింగ్ వార్తలు