Tamannaah Bhatia: తమన్నా కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం.. నటుడు అన్నూ కపూర్ షాకింగ్ కామెంట్స్
తమన్నా (Tamannaah Bhatia)స్కిన్ టోన్ పై అసభ్యకరమైన కామెంట్స్. క్షమాపణలు చెప్పున న్నూ కపూర్.
Annu Kapoor Apologizes for Comments on Tamannaah Skin Tone
- తమన్నా స్కిన్ టోన్ పై అన్నూ కపూర్ కామెంట్స్
- సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం
- క్షమాపణ చెప్పిన అన్నూ కపూర్
Tamannaah Bhatia: బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ నటి తమన్నా భాటియా(Tamannaah Bhatia)పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందించాడు. గతంలో ‘స్త్రీ 2’ సినిమాలోని ‘ఆజ్ కీ రాత్’ పాటను ఉద్దేశించి మాట్లాడుతూ, తమన్నా డ్యాన్స్‌ను మెచ్చుకోవడంతో పాటు ఆమె శరీర రంగు గురించి హిందీలో చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. నెటిజన్లు ఆయన వయసును ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో, ఈ అంశంపై ఆయన తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
Ram Charan: చిన్న సినిమాకు మెగా సపోర్ట్.. ‘వాలా 2’ టీంపై రామ్ చరణ్ ప్రశంసలు
తాను చేసిన వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని, భాషా భేదం వల్లే ఈ సమస్య తలెత్తిందని అన్నూ కపూర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ తను అదే విషయాన్ని ఇంగ్లిష్‌లో ‘మిల్క్ బాడీ’ అని మెచ్చుకుని ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదని, కానీ హిందీలో చెప్పేసరికి అది విమర్శలకు తావిచ్చిందని ఆయన పేర్కొన్నారు. కేవలం భాష మారినంత మాత్రాన ఒక వ్యక్తిని మెచ్చుకోవడంలో ఉండే ఉద్దేశం మారిపోదని, ఒకరి రూపాన్ని ప్రశంసించడం అంటే వారిని తప్పుగా చూడటం కాదని ఆయన స్పష్టం చేశారు.
తమన్నా పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, ఒకవేళ తన మాటల వల్ల ఆమె మనస్తాపానికి గురై ఉంటే క్షమాపణ చెప్పేందుకు తాను వెనుకాడబోనని ఆయన ప్రకటించారు. అవసరమైతే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని, మనసులో మాలిన్యం లేనప్పుడు అది తనకు పెద్ద విషయం కాదని అన్నూ కపూర్ వ్యాఖ్యానించారు. కళాకారుల ప్రతిభను, రూపాన్ని ఒక ఆరాధకుడిగా మాత్రమే చూశానని చెబుతూ, ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
