Sonusood
Acharya : చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని అందుకొని సక్సెస్ గా దూసుకుపోతుంది. తండ్రి కొడుకులని స్క్రీన్ మీద ఒకే సారి చూసి మెగా అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్యలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు నటించగా ఇందులో సోనూసూద్ విలన్ గా చేశారు. కరోనా కాలంలో సోనూసూద్ చేసిన సేవలు మనమంతా చూశాము. కరోనా తర్వాత కూడా సోనూసూద్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలని చేస్తూనే ఉన్నాడు. దీంతో సోనూసూద్ చాలా మందికి దేవుడిగా మారారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సోనూసూద్ చాలా మందికి సహాయం చేశారు.
అఖండ.. ఆచార్య.. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఏంటో తెలుసా??
తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అవ్వగా ఇందులో సోనూసూద్ విలన్ గా చేశారు. దీంతో హైదరాబాద్ లోని శాంతి థియేటర్ వద్ద సోనూసూద్ కి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు సోనూసూద్ అభిమానులు. ఆ తర్వాత సోనూసూద్ కటౌట్ కి పాలాభిషేకం చేశారు. ఈ కటౌట్ కి పెద్ద దండ వేసి, బొట్టు పెట్టి గుమ్మడికాయతో దిష్టి తీశారు అభిమానులు. దీంతో సోనూసూద్ కటౌట్ పెట్టి పాలాభిషేకం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై సోనూసూద్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
The #SonuSood Phenomenon continues as the fans pour their love on the real hero once again! Such feat is rarely achieved by few super stars! @SonuSood pic.twitter.com/1hNurkpZR7
— Harish Kumar (@apparalaharishk) April 30, 2022