Anshu Malika
Anshu Malika : నటి, మాజీ మంత్రి రోజా కూతురు అన్షు చిన్నప్పట్నుంచి చాలా ట్యాలెంట్ తో అనేక విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రచయిత్రిగా పుస్తకాలు కూడా రాసింది. పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. అన్షు ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటుంది. అక్కడ చదువుకుంటూనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన కెరీర్లో దూసుకుపోతుంది.(Anshu Malika)
అన్షుకి తాను చదువుతున్న కాలేజీలో అవార్డు వరించింది. అమెరికా బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా వర్సిటీలో రోజా కూతురు అన్షు మాలిక బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతుంది. తాజాగా అన్షు ప్రతిష్టాత్మకమైన మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025–26 అందుకుంది. ఇండియానా వర్సిటీ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరిన్ బిగ్గర్స్ టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అలా ఈ సంవత్సరం రోజా కూతురు ఈ అవార్డు గెలుచుకుంది.
Also See : చాన్నాళ్ల తర్వాత సినిమా ఈవెంట్లో బండ్ల గణేష్.. మళ్ళీ తన స్పీచ్ తో వైరల్.. ఫుల్ స్పీచ్ విన్నారా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు సంబంధించి వారి సాంకేతిక అవకాశాలపై అధ్యయనం చేయడం, నమీబియా, నైజీరియా, భారత్.. లాంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం, సోషల్ మీడియా ద్వారా పేదవర్గాలకు సాంకేతిక విద్యను అందించడం.. ఇలాంటి అంశాలపై పరిశోధన, వాటి కోసం పనిచేసిన అంశంలో అన్షుకి ఈ అవార్డును ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.
తాజాగా అన్షు ఈ అవార్డు తనకు వచ్చినట్టు, అక్కడి లోకల్ మీడియా తన గురించి రాసినట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అన్షుకి అభినందనలు తెలియచేస్తున్నారు.
Also Read : Balakrishna : మోకాళ్ళ మీద కూర్చొని మరీ ఆ పిల్లలతో ఫోటో దిగిన బాలయ్య.. ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా?