Prince Movie: అనుదీప్ శివకార్తికేయన్‌ల ప్రిన్స్ మూవీ నుంచి కొత్త అప్డేట్
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవీ దర్శకత్వంలో తమిళ్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రిన్స్’ దీపావళి లక్ష్యంగా అక్టోబర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. థమన్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలోని తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది...
- gum 95921
- Published On : August 31, 2022 / 02:54 PM IST
Anudeep, Siva Karthikeyan Prince Movie New Update..
Prince Movie: జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రిన్స్’ దీపావళి లక్ష్యంగా అక్టోబర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కామెడీ ప్రధాన కధాంశంగా ఫామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ అనుదీప్ ఈ మూవీని తెరకెక్కుస్తున్నాడు.
Siva Karthikeyan : జాతిరత్నాలు డైరెక్టర్‌తో శివకార్తికేయన్ సినిమా ప్రారంభం
సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ఫామిలీ ఆడియన్స్ కి మరియు సగటు ప్రేక్షకుడికి కూడా దగ్గర అయిన శివకార్తికేయన్, కామెడీ రైటింగ్ స్కిల్స్ ఉన్న అనుదీప్ లాంటి డైరెక్టర్ సినిమాలో కనిపిస్తే ప్రేక్షకుడికి నవ్వుల తిరునాళ్ళే అని చెప్పాలి. సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సురేష్ బాబు, సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తుండగా శివకార్తికేయన్ కు జంటగా మరియా ర్యాబోషప్క నటిస్తుంది.
Siva Karthikeyan : కమల్ హాసన్‌తో శివ కార్తికేయన్ సినిమా!
అయితే ఈ చిత్ర యూనిట్ ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టేశాయి. థమన్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘సకుటుంబ కథా చిత్రమిది. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం. కథకి అనుగుణంగా సినిమా పాండిచ్చెరి, లండన్ నేపథ్యంలో నడుస్తుంది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరినీ మెప్పిస్తుంది’ అని చెప్పారు. ఈసారి అనుదీప్ తన కామెడీ టేకింగ్ తో ఏమాత్రం ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.
