Siva Karthikeyan : కమల్ హాసన్‌తో శివ కార్తికేయన్ సినిమా!

ఇప్పుడు తన యాక్టింగ్ కెరీర్‌లో మరో మంచి మైల్ స్టోన్ అందుకున్నాడు శివ కార్తికేయన్.. ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి పని చెయ్యబోతున్నాడు..

Siva Karthikeyan : కమల్ హాసన్‌తో శివ కార్తికేయన్ సినిమా!

Siva Karthikeyan

Updated On : January 15, 2022 / 7:27 PM IST

Siva Karthikeyan: తమిళనాట టెలివిజన్ యాంకర్‌గా, మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి, స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శివ కార్తికేయన్. డిఫరెంట్ కథలు, ఛాలెంజింగ్ క్యారెక్టర్లతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

Maaran : ధనుష్ ‘మారన్’ మోషన్ పోస్టర్ చూశారా..

తమిళ స్టార్ ధనుష్, శివ కార్తికేయన్‌కు తనవంతు సపోర్ట్ చేసి అతనితో మంచి సినిమాలు తీశారు. ఇక పలు వేదికలపై సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను ఇమిటేట్ చేసి ఆయనను కూడా ఆశ్చర్యపరిచాడు శివ కార్తికేయన్.

Ashoka Vanamlo Arjuna Kalyanam : అల్లం గారి పెళ్లి కూతుర్ని చూశారా..

ఇప్పుడు తన యాక్టింగ్ కెరీర్‌లో మరో మంచి మైల్ స్టోన్ అందుకున్నాడు. ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి పని చెయ్యబోతున్నాడు. కమల్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో శివ కార్తికేయన్ హీరోగా సినిమా అనౌన్స్ చేశారు.

Swathimuthyam : చిన్న బెల్లంకొండ ‘స్వాతిముత్యం’..

‘రంగూన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చెయ్యబోతున్నారు. కమల్ హాసన్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తుంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ.. హీరో, డైరెక్టర్ కమల్ హాసన్‌తో కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది.