Anupam is the heroine in Tillu's sequel which has given clarity with the video by the movie team
DJ Tillu 2 : గత ఏడాది ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘డీజే టిల్లు’. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పథకం పై ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీలో హీరో సిద్దు బాడీ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకు వచ్చేందుకు మూవీ టీం నిర్ణయం తీసుకోని ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ తో సీక్వెల్ ప్రకటించింది.
DJ Tillu 2: సీక్వెల్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డీజే టిల్లు!
ఇక ఈ సీక్వెల్ ని డైరెక్ట్ చేయడానికి డీజే టిల్లు తెరకెక్కించిన విమల్ కృష్ణనే అనుకున్న మూవీ టీం కొన్ని కారణాలు వల్ల ఆ ప్లేస్ లో మల్లిక్ రామ్ ని ఎంపిక చేసుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు మొదటిగా శ్రీలీలని తీసుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొన్న అనుపమ మొదటి షెడ్యూల్ షూటింగ్ లో కూడా హాజరయ్యింది. అయితే ఈ సినిమా నుంచి ఈ భామ కూడా తప్పుకున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి.
ఆమె ప్లేస్ లోకి ప్రేమమ్ సుందరి మడోన్నా సెబాస్టియన్ ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. వీటి పై మూవీ టీం కూడా స్పందించక పోవడంతో.. ఆ వార్తలన్నీ నిజమని నమ్మారు ఆడియన్స్. అయితే ఆ వార్తలు అన్నిటికి చెక్ పెడుతూ చిత్ర నిర్మాతలు సెట్ లోని ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అనుపమ, హీరో సిద్దు కర్లీ హెయిర్ ని సరి చేస్తూ కనిపిస్తుంది. ఈ వీడియోతో అనుపమ ఈ సినిమా నుంచి తప్పుకుంది అనే వార్తల్లో నిజం లేదని కుండా బద్దలుకొట్టేశారు మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.