Anupam Kher : రవీంద్రనాధ్ ఠాగూర్ గా అనుపమ్ ఖేర్.. ఈ ఫోటో చూశారా? అచ్చు దింపేశారు..
తాజాగా అనుపమ్ ఖేర్ రవీంద్రనాధ్ ఠాగూర్ లుక్ లో మేకప్ వేసుకున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తూ అచ్చు నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే ఉన్నారు.

Anupam Kher doing Rabindranath Tagore Biopic He post a photo looks like same Rabindranath Tagore
Anupam Kher : ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలో బయోపిక్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో అయితే చెప్పనవసరం లేదు. వరుస బయోపిక్స్ తెరకెక్కుతూనే ఉన్నాయి. తాజాగా మరో బయోపిక్ రాబోతున్నట్టు సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ ప్రకటించారు.
ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనుపమ్ ఖేర్. ఇటీవల కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలతో ఒక్కసారిగా దేశమంతా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలు అనుపమ్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాయి. వీటి తర్వాత మరిన్ని మంచి మంచి పాత్రలు వస్తున్నాయి.
Project K T-shirt : ‘ప్రాజెక్ట్ K’ టీ షర్ట్ కావాలా.. అయితే ఇలా చేయండి
తాజాగా అనుపమ్ ఖేర్ రవీంద్రనాధ్ ఠాగూర్ లుక్ లో మేకప్ వేసుకున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తూ అచ్చు నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. గురుదేవ్, కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రను నా 538వ సినిమాలో పోషించడం చాలా గర్వంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియచేస్తాము అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అనుపమ్ ఖేర్. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. బాలీవుడ్ లో త్వరలో రవీంద్రనాథ్ ఠాగూర్ బయోపిక్ రానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఫొటో చూసినవాళ్లంతో మరోసారి అనుపమ్ ఖేర్ డెడికేషన్ ని అభినందిస్తున్నారు. ఈ వయసులో కూడా ఒక పాత్రకోసం అంత కష్టపడుతున్నారు అంటూ అభినందిస్తున్నారు.
Delighted to portray #Gurudev #RabindranathTagore in my 538th project. Will reveal the details in due course. ये मेरा सौभाग्य है कि मुझे गुरुदेव को पर्दे पर साकार करने का सौभाग्य प्राप्त हुआ है! जल्द ही इस फ़िल्म की अधिक जानकारी आपके साथ संझा करूँगा! ??? pic.twitter.com/qnLqduSPq3
— Anupam Kher (@AnupamPKher) July 7, 2023