Anupama Parameswaran : నేను కూడా ప్రేమలో పడ్డాను.. విడిపోయాను.. కాని : అనుపమ పరమేశ్వరన్

అనుపమ తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ''నిజ జీవితంలో నేను కూడా ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత విడిపోయాను. నా లవ్ ఫెయిల్యూర్ ని నేను గుర్తు చేసుకొని. సెట్లో ప్రేమ సన్నివేశాల్లో.......

Anupama

Anupama Parameswaran :   తెలుగులో తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ మందికి ఫేవరేట్ గా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్. సినిమాల్లోనే కాక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అనుపమ వరుస సినిమాలతో సందడి చేయనుంది. ఇప్పటికే అనుపమ నటించిన ‘రౌడీబాయ్స్‌’ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అయింది. ఇక అనుపమ నటిస్తున్న ‘కార్తికేయ2’, ‘18 పేజీస్‌’ సినిమాలు కూడా ఈ సంవత్సరమే రిలీజ్ అవుతాయి. అంతే కాక మరిన్ని సినిమాలకి సైన్ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో అనుపమ ఈ సంవత్సరం మరింత హ్యాపీగా ఉంది.

ప్రస్తుతం ‘రౌడీ బాయ్స్’ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టడంతో అనుపమ ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం, తన ప్రేమ విషయాలు, తాను చేసిన పాత్రల గురించి తెలియచేసింది. అనుపమ మాట్లాడుతూ.. ‘‘నటుల జీవితాలపై తప్పకుండా వృత్తి ప్రభావం ఎంతోకొంత ఉంటుంది. కొన్ని పాత్రలు చేసి బయటికొచ్చాక అవి మన మనసుల్ని వెంటాడుతాయి. నేను మాత్రం చాలావరకు రెండు జీవితాల్ని వేర్వేరుగా ఉండేలా చూసుకుంటాను. కెమెరా ముందుకు వెళ్తే కథలు, పాత్రలే ప్రపంచంగా మారిపోతుంటాను. ఆ పాత్ర సంఘర్షణ నుంచే భావోద్వేగాల్ని పండించేందుకు ప్రయత్నిస్తుంటా. అంతే కానీ నా వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుని నటించే ప్రయత్నం చేయను. నేను చేసిన పాత్రలే నాకు ఎక్కువ జీవితాన్ని పరిచయం చేశాయి” అని తెలిపింది.

RGV : ఆర్జీవి ప్రశ్నలకి సమాధానాలిచ్చిన పేర్ని నాని

ఇక తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ”నిజ జీవితంలో నేను కూడా ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత విడిపోయాను. నా లవ్ ఫెయిల్యూర్ ని నేను గుర్తు చేసుకొని. సెట్లో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు నా ప్రేమని అస్సలు గుర్తు చేసుకోను. అలా అలవాటుపడితే చాలా కష్టమని నా అభిప్రాయం. కథల్లోని ప్రతీ సంఘర్షణ నా జీవితంలో ఉండదు. జీవితం వేరు, కథలు వేరు” అని తెలిపింది అనుపమ.