Anupama Parameswaran announce new movie with Cinema Bandi director
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉంది. ఇటీవల కార్తికేయ 2 (Karthikeya 2) తో పాన్ ఇండియా హిట్టుని అందుకుంది. మళ్ళీ వెంటనే 18 పేజిస్ తో (18 Pages) మంచి లవబుల్ హిట్టుని సొంతం చేసుకుంది. ఆ తరువాత బట్టర్ ఫ్లై (Butterfly) అంటూ ఓటీటీలో పలకరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు, తమిళ – మలయాళంలో ఒకొక సినిమా చేస్తుంది. తాజాగా తెలుగులో మరో సినిమా ఛాన్స్ కొట్టేసింది. 2021 లో సినిమా బండి (Cinema Bandi) అంటూ ఒక చిన్న సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే.
Adipurush : ఆదిపురుష్ సినిమాకి 10 వేల టికెట్స్‌ని ఫ్రీగా ఇస్తున్నారు.. కానీ వాళ్ళకి మాత్రమే!
చిన్న సినిమా అయినా విజయాన్ని మాత్రం చాలా పెద్దగా అందుకుంది. గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (IFFI) జ్యూరీ స్పెషల్ క్యాటగిరిలో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డుని అందుకుంది. ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం తరువాత ఇప్పుడు తన తదుపరి సినిమాని ప్రకటించాడు. అనుపమతో తన నెక్స్ట్ ఫిలిం అంటూ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అనుపమ వంటి స్టార్ యాక్టర్ తో ఈ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తన తదుపరి సినిమాని ప్రకటించడంతో.. ఈసారి ఏ అవార్డు అందుకుంటారో? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
Gandeevadhari Arjuna : డాడీ వెనకే అబ్బాయి.. రెండు వారాల గ్యాప్‌లో చిరు, వరుణ్ సినిమాలు..
కాగా అనుపమ నటిస్తున్న టిల్లు స్క్వేర్ (Tillu Square) శరవేగంగా జరుగుతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తుంది. దీంతో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 15న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.