Anupama Parameswaran : అన్నయ్య అంటున్న అనుపమ పరమేశ్వరన్.. అలా పిలవద్దంటున్న రవితేజ..

అందమైన అమ్మాయిలు అసలు అన్నయ్య అనే వర్డ్ వాడొద్దు అన్న రవితేజ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Anupama Parameswaran Raviteja Conversation in Eagle Movie Promotional Interview goes Viral

Anupama Parameswaran : రవితేజ(Raviteja) ఫిబ్రవరి 9న ఈగల్(Egale) సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల.. ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా కేవలం మూవీలోని కొంతమంది యాక్టర్స్ తో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలాగా ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఓ చిన్న పార్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కార్తీక్ అన్నయ్య అంది. దీంతో రవితేజ.. నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా అంటూ ఓ వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. వెంటనే.. బేసిగ్గా అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదు. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో అని అన్నాడు.

Also Read: Hemanth M Rao : కన్నడ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేసిన ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్..

అయితే అనుపమ.. నేను అతనితో కలిసి నాలుగో సినిమా చేస్తున్నాను. మా మధ్య ర్యాపో ఉండి అలా పిలుస్తున్నాను అంది. అయితే మేము మూడు సినిమాలు మీతో చేసి ఆపేస్తాం అని కౌంటర్ ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్. ఇక నవదీప్.. కార్తీక్ ఎంత బాధపడుతున్నాడో నువ్ అన్నయ్య అంటున్నావని అని అన్నాడు. ఈ ఇంటర్వ్యూ ఇలా సరదాగా సాగింది. దీంతో అందమైన అమ్మాయిలు అసలు అన్నయ్య అనే వర్డ్ వాడొద్దు అన్న రవితేజ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.