Hemanth M Rao : కన్నడ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేసిన ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్..

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ రావు దర్శకత్వంలో సినిమాని ప్రకటించారు.

Hemanth M Rao : కన్నడ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేసిన ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్..

Sapta Sagaralu Dhaati Director Hemanth Rao announced next Movie with Shiva Rajkumar

Updated On : February 3, 2024 / 7:09 PM IST

Hemanth M Rao : సప్త సాగరాలు దాటి(Sapta Sagaralu Dhaati) సినిమా రెండు పార్టులతో కన్నడ, తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ హేమంత్ రావు. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు పార్టులు ప్రేక్షకులని ఎమోషనల్ గా కట్టిపడేశాయి. ఈ సినిమాల డైరెక్టర్ హేమంత్ తాజాగా కొత్త ప్రాజెక్టు ని అనౌన్స్ చేశారు.

Also Read : Sandeep Vanga : సందీప్ వంగ సినిమాలపై అమీర్ ఖాన్ మాజీ భార్య కామెంట్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన సందీప్ వంగ..

ఏకంగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shiva Rajkumar) హీరోగా హేమంత్ రావు దర్శకత్వంలో సినిమాని ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ హిట్స్ మీద ఉన్న డైరెక్టర్ హేమంత్ శివరాజ్ కుమార్ తో ఈ సినిమా ప్రకటించడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని కూడా కన్నడ – తెలుగులో రిలీజ్ చేయొచ్చు అని సమాచారం. త్వరలోనే సినిమా గురించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.