Anupama Parameswaran Tested Covid Positive
Anupama Parameswaran: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కార్తికేయ-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించగా, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లీడ్ రోల్‌లో నటించాడు. చాలా రోజుల తరువాత అనుపమ పరమేశ్వరన్ ఓ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో అమ్మడి సంతోషానికి అవధలు లేకుండా పోయాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కార్తికేయ-2 టీమ్‌తో కలిసి అనుపమ, సౌత్, నార్త్ ఇలా తేడా లేకుండా ఇండియావైడ్ ప్రమోషన్స్‌లో బిజీగా మారింది. అయితే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ-2 చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకులకు ఓ షాకిచ్చింది. తాను జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో కరోనా పరీక్షలు చేయించుకుంది. ఈ క్రమంలో అనుపమకు కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. వెంటనే అమ్మడు తన ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లింది.
తనను ఇటీవల కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అనుపమ కోరింది. ఇక అనుపమ నెక్ట్స్ సినిమాల విషయానికి వస్తే.. మరోసారి హీరో నిఖిల్ సరసన 18 పేజీస్ అనే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే తమ అభిమాన హీరోయిన్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.