Anupama Parameswaran wants to direct movies
Anupama Parameswaran : ప్రేమమ్ సినిమాతో మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ బోల్డ్ ఫొటోలతో తమ అందాలు పరిస్తే అనుపమ మాత్రం చీరలు, ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే తన అందాలని పరుస్తుంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన డిఫరెంట్ క్యూట్ ఫొటోలతో అభిమానుల్ని బాగానే పెంచుకుంది అనుపమ. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో దాదాపు అరడజను సినిమాలకి పైగానే అనుపమ చేతిలో ఉన్నాయి. ఇటీవల నిఖిల్ తో కలిసి కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ నిఖిల్ తో కలిసి 18 పేజెస్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు అనుపమ కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
తాజాగా 18 పేజెస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. అనుపమ మాట్లాడుతూ.. నేను కచ్చితంగా దర్శకత్వం చేస్తాను. కానీ అది చాలా పెద్ద భాద్యత. నేను కథానాయికగానే ఇంకా పూర్తిగా నటించలేదు. ప్రస్తుతం నటన మీదే ద్రుష్టి పెడుతున్నాను. డైరెక్షన్ చేసే ముందు కనీసం ఒకరిద్దరు అగ్ర దర్శకుల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేయాలనుకుంటున్నాను. అంతే కాక డైరెక్షన్ చేస్తే ఒక సంవత్సరం ముందే నటనకి బ్రేక్ ఇస్తాను. ఒకవేళ నేను సినిమాలు డైరెక్ట్ చేస్తే అందులో మాత్రం నేను నటించను అని తెలిపింది.
Pathan Controversy : లోక్‌సభలో పఠాన్ సినిమా వివాదం..
ప్రస్తుతం హీరోయిన్ గా చేతి నిండా సినిమాలు ఉన్న అనుపమ డైరెక్షన్ చేస్తా అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మలయాళ కుట్టి ఎప్పుడు డైరెక్షన్ చేస్తుందో చూడాలి.