Pathan Controversy : లోక్‌సభ‌లో పఠాన్ సినిమా వివాదం..

ఇప్పుడు ఈ పఠాన్ సినిమా పాట వివాదం లోక్‌సభ‌ కి కూడా పాకింది. తాజాగా జరుగుతున్న లోక్‌సభ‌ సమావేశాల్లో పఠాన్ సినిమా వివాదం తెరపైకి వచ్చింది. బీఎస్పీ ఎంపీ కున్వర్‌ డానిష్‌ అలీ లోక్‌సభ‌ లో...........

Pathan Controversy : లోక్‌సభ‌లో పఠాన్ సినిమా వివాదం..

Pathan Controversy in loksabha

Pathan Controversy :  బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో రాబోతున్నాడు. షారుఖ్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్ సినిమాగా పఠాన్ తెరకెక్కుతుంది. జనవరి 25న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి భేషరమ్‌ రంగ్‌ అనే ఓ పాటని విడుదల చేశారు.

అయితే ఈ పాటలో దీపికా పదుకొనే మరీ ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేయడం, కాషాయ రంగు బికినీలు వేయడం, డిఫరెంట్ ఫోజులతో డ్యాన్సులు చేయడంతో ఈ పాట, సినిమా వివాదానికి దారి తీసింది. ఈ పాటపై పలు హిందూ, ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, మహిళలు కూడా ఈ పాటని విమర్శిస్తున్నారు. ఈ పాటని తీసేయాలని, సినిమా రిలీజ్ చేయనివ్వమని, సినిమాని బ్యాన్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

Janhvi kapoor : కనీసం వాళ్ళు చూసినా నా సినిమా హిట్ అయ్యేది..

ఇప్పుడు ఈ పఠాన్ సినిమా పాట వివాదం లోక్‌సభ‌ కి కూడా పాకింది. తాజాగా జరుగుతున్న లోక్‌సభ‌ సమావేశాల్లో పఠాన్ సినిమా వివాదం తెరపైకి వచ్చింది. బీఎస్పీ ఎంపీ కున్వర్‌ డానిష్‌ అలీ లోక్‌సభ‌ లో మాట్లాడుతూ.. పఠాన్ సినిమాని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా అంటుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు. అధికారంలో ఉన్న వారే సినిమాని బ్యాన్ చేయొచ్చు అలాంటప్పుడు సెన్సార్ బోర్డుతో పనేంటి అని ప్రశ్నించారు.