Arundhati Child Artist : పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా..

అనుష్క సూపర్ హిట్ సినిమా అరుంధతిలో చిన్నప్పటి అనుష్క పాత్ర పోషించిన అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది.

Anushka Shetty Arundhati Movie Child Artist Divya Nagesh is Getting Married

Arundhati Child Artist : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు అంతా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి సినిమాలలోనో, వేరే ప్రొఫెషన్స్ లోనో సెటిల్ అయిపోయారు. కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా పెళ్లి చేసుకోబోతుంది. అనుష్క సూపర్ హిట్ సినిమా అరుంధతిలో చిన్నప్పటి అనుష్క పాత్ర పోషించిన అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దివ్య నగేష్. తెలుగు – తమిళ్ కుటుంబానికి చెందిన అమ్మాయి.

దివ్య అరుంధతి మాత్రమే కాక చైల్డ్ ఆర్టిస్ట్ గా అపరిచితుడు, సింగం పులి.. ఇలా చాలానే తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం దివ్య డ్యాన్సర్ గా, మోడల్ గా చేస్తూనే నటిగా అవకాశాలు ట్రై చేస్తుంది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య ఇప్పుడు త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. అజిత్ కుమార్ అనే ఓ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవలే వీరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

Also Read : Trump Effect : ట్రంప్ నిర్ణయాలతో.. అమెరికాలో తెలుగు సినిమా కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్..?

దివ్య తన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేసి.. 2020 లో కలిసి ఇప్పుడు 2025 లో భార్యాభర్తలం కాబోతున్నాము, తను నాకెంతో సపోర్ట్ చేసాడు అంటూ తనకు కాబోయే భర్త గురించి రాసుకొచ్చింది. దీంతో దివ్య – అజిత్ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు సరదాగా అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ కి పెళ్లి అయిపోతుంది కానీ అసలైన అరుంధతికి మాత్రం ఇంకా పెళ్లి అవ్వలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Anasuya : నేను బికినీ వేసుకుంటే అది నా ఇష్టం.. ప్రతి వాళ్ళ లైఫ్ లో ఆడవాళ్లు ఉంటారు.. కర్మ తిరిగొస్తుంది.. అనసూయ వ్యాఖ్యలు..

అరుంధతి సినిమా 2009లో వచ్చింది. సినిమా వచ్చి ఆల్మోస్ట్ 16 ఏళ్ళు కావొస్తుంది. అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య ప్రేమించి పెళ్లి చేసేసుకుంటుంది. కానీ అనుష్క మాత్రం 43 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి మాట ఎత్తట్లేదు. గతంలో ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చినా అవి అన్ని రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది. మరి అనుష్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో లేక అసలు పెళ్లే చేసుకోదా అని సందేహిస్తున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన అనుష్క బాహుబలి తర్వాత నుంచి మాత్రం చాలా సెలెక్టివ్ గా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అనుష్క చేతిలో తెలుగులో ఒక సినిమా, మలయాళం లో ఒక సినిమా ఉన్నాయి.