అందాల భామ అనుష్క పెళ్లి ఇండియన్ క్రికెటర్‌తో జరుగబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
మన అందాల దేవసేన బాహుబలిని పెళ్లి చేసుకుంటుందనుకుంటే.. మన సౌత్‌కి, ఆ మాటకొస్తే అస్సలు సినిమాలకే సంబందంలేని క్రికెటర్‌ని పెళ్లి చేసుకోబోతోంది. కాదు కాదు.. ఆల్రెడీ పెళ్లయిపోయింది. కానీ ఆవిషయం బయటకు రాకుండా జాగ్రత్తపడుతోందట. ప్రభాస్‌తో ప్రేమాయణం అని, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నారని తెగ గుసగుసలాడిన సోషల్ మీడియా ఇప్పుడు అనుష్కకి వేరే వాళ్లతో పెళ్లి చేసేసింది.
టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌లోనే హీరోయిజం చూపించిన ఈ జనరేషన్ హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది అనుష్క. గ్లామర్‌తో పాటు.. అంతటి స్టేచర్‌ను ఈజీగా క్యారీ చేసే మంచి ఆర్టిస్ట్‌గా పేరుంది స్వీటీకి. గ్లామర్‌తో యాక్షన్ యాడ్ చేసి చూపించడం చాలా కష్టం. కానీ అనుష్క గ్లామర్, పర్ఫార్మెన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్నింటినీ ఆడియన్స్‌కి నచ్చేలా, మెచ్చేలా డెలివర్ చేయడంలో ముందుంటుంది. సౌత్‌లో నంబర్ వన్ 38 ఏళ్ల అనుష్క పెళ్లి చేసుకోబోతోందట.
ఇండస్ట్రీ మొత్తం అనుకుంటున్నట్టు ప్రభాస్‌ని కాదు.. అసలు సినిమాలకు ఏమాత్రం సంబంధంలేని సౌత్‌కి కూడా చెందని అబ్బాయిని పెళ్లాడనుందట. అది కూడా ఓ క్రికెటర్‌ని. అసలు పెళ్లి చేసుకోవడం కాదు.. ఆల్రెడీ ఆ క్రికెటర్‌కి, అనుష్కకి పెళ్లి అయిపోయిందని.. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందని మీడియాలో, సోషలో మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
అనుష్క,ప్రభాస్ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని మొన్న మొన్నటి వరకూ వార్తలు రాసిన మీడియా ఇప్పుడు అనుష్కకు క్రికెటర్‌తో పెళ్లి చేసేసింది. అసలు మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఎలాంటి రిలేషన్ లేదని అంతకు ముందు చాలా సార్లు చెప్పారు అనుష్క, ప్రభాస్. అయినా సరే.. వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హిట్ అవ్వడంతో .. రియల్ లైఫ్‌లో కూడా వీళ్లు పార్టనర్స్ అయితే బావుటుందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు అనేసుకున్నారు. అలా.. ఇప్పుడు కూడా క్రికెటర్‌తో డేటింగ్ అని కొంతమంది అంటుంటే.. కాదు.. పెళ్లయిపోయిందని కొంతమంది గాసిప్స్ చెప్పుకుంటున్నారు. అనుష్క ప్రస్తుతం ఇవేం పట్టించుకోకుండా ఏప్రిల్‌లో రిలీజ్ అవుతున్న ‘నిశ్శబ్దం’ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది.