Site icon 10TV Telugu

Ghaati : అనుష్క ‘ఘాటీ’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ వచ్చేసింది.. హీరో ఎవరో తెలుసా?

Anushka Shetty Vikram Prabhu Ghaati Movie Glimpse Released

Anushka Shetty Vikram Prabhu Ghaati Movie Glimpse Released

Ghaati : స్వీటీ అనుష్క శెట్టి గతంలో లాగా వరుసగా సినిమాలు చేయకుండా అడపాదడపా సినిమాలు చేస్తుంది. గత సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. త్వరలో ఘాటీ సినిమాతో రానుంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క మెయిన్ లీడ్ లో ఘాటీ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఘాటీ సినిమా నుంచి అనుష్క పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు.

Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడిని ట్రోల్ చేసే వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన బేబీ డైరెక్టర్.. 8 వరుస హిట్స్ సాధించిన డైరెక్టర్..

తాజాగా నేడు ఈ సినిమాలో నటించే హీరోని అనౌన్స్ చేసి గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఘాటీ సినిమాలో తమిళ్ హీరో విక్రమ్ ప్రభు మరో మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. విక్రమ్ ప్రభు ఈ సినిమాలో దేశీ రాజు అనే పాత్రలో నటిస్తుండగా తాజాగా ఆ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు. మీరు కూడా గ్లింప్స్ చూసేయండి..

ఈ గ్లింప్స్ చూస్తుంటే హీరోని పోలీసులు తరుముతున్నట్టు ఉంది. హీరో విక్రమ్ ప్రభు, అనుష్క బైక్స్ పై ఏదో మోసుకొని వెళ్తున్నట్టు చూపించారు. మరోసారి ఇది యాక్షన్ సినిమా అని చూపించారు. ఇక ఘాటీ సినిమా ఏప్రిల్ 18న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. బాహుబలి తర్వాత తన సినిమాల ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనట్లేదు. మరి ఈ సినిమాకు అయినా ప్రమోషన్స్ కి బయటకు వస్తుందా చూడాలి.

Also See : Daaku Maharaaj : ‘డాకు మహారాజ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా!

Exit mobile version