Ghaati : బాహుబలి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది అనుష్క. ఇటీవల డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘ఘాటీ’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి అనుష్క గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Also Read : Comedian Ali : రాజేంద్రప్రసాద్ తనని బూతుపదంతో తిట్టడంపై అలీ స్పందన.. ఏమన్నారంటే?
తాజాగా అనుష్క ఘాటీ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. ఘాటీ సినిమాని జులై 11న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు అయితే ఆ డేట్ లో ఏ సినిమా ప్రకటించలేదు. మరి అనుష్క ఘాటీ సోలోగా వస్తుందా ఇంకేమైనా సినిమాలు పోటీకి వస్తాయా చూడాలి. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.