Thug Life : ‘థగ్ లైఫ్’ సినిమాపై బ్యాన్.. కమల్ క్షమాపణలు చెప్పకపోతే సినిమా రిలీజ్ అవ్వదు.. హైకోర్టుకు వెళ్లిన నిర్మాత..
కమల్ వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు, కన్నడ భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Karnataka Film Chamber Warning to Kamal Haasan and Thug Life Producers went to High Court
Thug Life : కమల్ హాసన్ – మణిరత్నం చాలా ఏళ్ళ తర్వాత జూన్ 5న థగ్ లైఫ్ సినిమాతో రాబోతున్నారు. ఈ కాంబోతో పాటు సినిమాలో శింబు, త్రిష, అభిరామి.. లాంటి స్టార్స్ ఉండటంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గానే చేసారు. అయితే ఇటీవల బెంగుళూరులో ఈవెంట్ నిర్వహించగా కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టింది అంటూ కమల్ హాసన్ మాట్లాడాడు.
దీంతో కమల్ వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు, కన్నడ భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ నటీనటులు, రాజకీయ నాయకులు కూడా కమల్ పై విమర్శలు చేసారు. కమల్ దిష్టిబొమ్మలు కూడా తగలబెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు.
Also Read : Nitya Shetty : ఇస్రోలో ఆఫర్.. ఇన్ఫోసిస్ లో జాబ్.. అన్ని వదిలేసి సినిమాల్లోకి.. దేవుళ్ళు పాప బ్యాక్ గ్రౌండ్..
అయితే కమల్ క్షమాపణలు చెప్పి వివాదానికి స్వస్తి చెప్పకుండా ప్రేమతోనే అలా మాట్లాడానని, ప్రేమ ఎప్పుడూ సారీ చెప్పదని, నేను తప్పు చేస్తేనే సారీ చెప్తాను. నాకు గతంలో కూడా ఇలా బెదిరింపులు వచ్చాయి. నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తాను లేకపోతే చెప్పను అని ఖరాఖండిగా చెప్పారు.
దీంతో కన్నడ ప్రజలు మరింత మండిపడుతున్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని థగ్ లైఫ్ సినిమా రిలీజ్ లోపు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే అధికారికంగానే సినిమాను బ్యాన్ చేస్తాం అంటూ నోటీసులు ఇచ్చింది. తాజాగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలు కమల్ హాసన్ పై కోపంగా ఉన్నారు. మేము సౌత్ ఫిల్మ్ ఛాంబర్ కు కూడా సందేశం పంపాము. 5వ తేదీన తన సినిమా విడుదలకు ముందు ఆయన క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ సినిమా విడుదల చేయడానికి అనుమతించబోమని డిస్ట్రిబ్యూటర్స్ కూడా నిర్ణయించారు అని తెలిపారు.
Also Read : Rajendra Prasad : నేనేంటో అందరికి తెలుసు.. విమర్శలపై రాజేంద్రప్రసాద్ హాట్ కామెంట్స్..
దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా రిలీజ్ పై సందిగ్దత నెలకొంది. స్వయంగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగడంతో నిర్మాతలు చేసేదేమి లేక కర్ణాటక హైకోర్టు బాట పట్టారు. సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు కలిగించరాదు అని నోటీసులు ఇవ్వమని విజ్ఞప్తి చేసారు. మరి కమల్ హాసన్ తగ్గి క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా రిలీజ్ కష్టమే అంటున్నారు.