Nitya Shetty : ఇస్రోలో ఆఫర్.. ఇన్ఫోసిస్ లో జాబ్.. అన్ని వదిలేసి సినిమాల్లోకి.. దేవుళ్ళు పాప బ్యాక్ గ్రౌండ్..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా శెట్టి తన చదువు, జాబ్స్ వివరాలు తెలిపింది.

Devullu Fame Child Artist Nitya Shetty Study and Job Background Before Turned as Heroine
Nitya Shetty : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఇప్పుడు నటీనటులు అవుతున్న సంగతి తెలిసిందే. దేవుళ్ళుతో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది నిత్యా శెట్టి. చైల్డ్ ఆర్టిస్ట్ గానే నంది అవార్డులు అందుకున్న ఈ పాప కరోనా ముందు సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే సినిమాల కంటే ముందు నిత్యా శెట్టి జాబ్ కూడా చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా శెట్టి తన చదువు, జాబ్స్ వివరాలు తెలిపింది.
Also Read : Rajendra Prasad : నేనేంటో అందరికి తెలుసు.. విమర్శలపై రాజేంద్రప్రసాద్ హాట్ కామెంట్స్..
నిత్యా శెట్టి మాట్లాడుతూ.. మొదట డాక్టర్ అవుదామనుకున్నాను కానీ మా చుట్టాల్లో ఒకరు డాక్టర్ ఉన్నారు. డాక్టర్ అంటే లైఫ్ లాంగ్ చదవాలి అని చెప్పడంతో డాక్టర్ వదిలేసా. బిటెక్ లో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ చేశాను. అప్పట్లో యాక్టర్ అవ్వాలని ఆలోచన లేదు. బిటెక్ తర్వాత ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. మైసూర్ వెళ్లి ఇన్ఫోసిస్ లో జాబ్ చేశాను. మధ్యలో ఇస్రో ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను. ఆఫర్ కూడా వచ్చింది. కానీ ఇస్రో వద్దనుకుని ఇన్ఫోసిస్ లోనే ఉండిపోయాను.
ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీ అవార్డులు కూడా తీసుకున్నా. అక్కడ ఆఫీస్ లో నా చుట్టూ ఉండేవాళ్ళు సినిమాలు చేసుకోవచ్చు కదా, నువ్ ట్రై చేస్తే వస్తాయి కదా, నువ్వు ఒకప్పుడు ఆర్టిస్ట్ కదా అని బ్రెయిన్ వాష్ చేయడంతో నేను ఆలోంచించడం మొదలుపెట్టా. సినిమాల్లోకి వెళ్దాం అనుకోని ఫిక్స్ అయ్యాక జాబ్ రిజైన్ చేశాను. ఆన్ సైట్ పంపిస్తాను అన్నారు అయినా జాబ్ రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను అని తెలిపింది.
Also Read : Prasad Behara : అన్ని వదిలేసి.. ప్రపంచమంతా నడుచుకుంటూ వెళ్ళాలి.. అంతా ప్రిపేర్ చేసుకున్నా.. కానీ..