Rajendra Prasad : నేనేంటో అందరికి తెలుసు.. విమర్శలపై రాజేంద్రప్రసాద్ హాట్ కామెంట్స్..
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

Rajendra Prasad speech in Shashtipoorthi Movie scuccess meet
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌ని అనుకోకుండా ఓ మాట అనడంతో బాగా ట్రోల్ అయ్యారు. అప్పుడు ఆయన క్షమాపణ చెప్పాడు. నిన్న మరోసారి స్టేజిపై బూతుపదం వాడి విమర్శల పాలవుతున్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పని చేసిన నటీనటులంతా హాజరు అయ్యారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సైతం హాజరు అయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనుకోకుండా అలీని ఓ బూతు పదంతో ప్రసావించి.. మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అని అన్నారు.
Prasad Behara : అన్ని వదిలేసి.. ప్రపంచమంతా నడుచుకుంటూ వెళ్ళాలి.. అంతా ప్రిపేర్ చేసుకున్నా.. కానీ..
స్టేజీపై ఇలా అందరి ముందు అలీని అనడంతో రాజేంద్రప్రసాద్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీటిపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు.
షష్టిపూర్తి సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘నేను సరదాగా ఉంటాను అందరితో. వాళ్ళు నాతో అలాగే ఉంటారు. ఇటీవల కొన్ని ఈవెంట్స్ లో వాళ్ళు నా వాళ్ళు అని గబాల్న అనేసిన మాటలను కొంతమంది తప్పు అని అంటున్నారు. అది మీ సంస్కారం. నేను ఇలాగే ఉంటాను. నేనేంటో అందరికి తెలుసు సరదాగా ఫ్లో లో అన్న మాటలను తప్పుగా తీసుకోవడం అది మీ సంస్కారం.’ అని అన్నారు.