అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ ఫిక్స్
అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల..

అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల..
స్వీటీ అనుష్క, విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలిం.. ‘నిశ్శబ్దం’.. (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలిసి వర్క్ చెయ్యడాన్ని క్రాస్ఓవర్ అంటారు).. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. అనుష్క బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభించింది.. తాజాగా ‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
ముందుగా జనవరి 31న విడుదల చేయాలనుకున్నారు కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాయిదా వేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 2న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో చిత్రాన్ని భారీగా విడుదల చేయనున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క సాక్షి అనే చిత్రకారిణిగా, మాధవన్ మ్యుజిషియన్‌గా, అంజలి క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్‌గా కనిపించనున్నారు..
‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడిసన్ నెగెటివ్ రోల్ పోషించారు.. షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం : గోపి సుందర్, నిర్మాతలు : కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్.