RGV: చిన్న కేసుకే డేరింగ్‌ వర్మ ఎందుకు వణికిపోతున్నట్లు?

గతంలో రాజకీయ నేతలు, పార్టీల విషయంలో వర్మ చేసిన కామెంట్స్‌ ప్రస్తావనకు వస్తున్నాయి.

Ram Gopal Varma

ఆర్జీవీ.. ఈ పేరే ఓ సంచలనం. ఓ రకంగా కాంట్రవర్సీకి కేరాఫ్. ఆయన మాట్లాడే తీరు నచ్చనివాళ్లు ఎందరుంటారో..ఆయన స్పీచ్‌లను, ఫిలాసఫీని ఫాలో అయ్యే యూత్‌ అంత కంటే ఎక్కువుంటారు. ప్రతీ విషయంపై డీప్‌ సబ్జెక్ట్‌ కలిగి ఉన్న వర్మకు ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం బాలీవుడ్ వరకు సాగింది. సంచలన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా. ఎన్నో హిట్లు మరెన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా ఉన్న ఆర్జీవీ..ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గరు.

ముంబైలో అండర్ వరల్డ్‌ మాఫియా రాజ్యమేలుతున్న వేళ..డాన్లను కూడా గెలికి వెనక్కి తగ్గలేదు వర్మ. రాయలసీమ ఫ్యాక్షనిస్టుల విషయంలో సినిమాలు తీసి కూడా థ్రెట్‌ను ఫేస్ చేశారు. తర్వాత అడల్ట్ కంటెంట్ మూవీలు, వెబ్‌ సిరీస్‌లు తీసి..మహిళల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అలా ఎన్నో విషయాల్లో కార్నర్ అయిపోయి పరిస్థితి వచ్చినా తన చాకచక్యంతో ఎస్కేస్‌ అవుతూ ఎక్కడా ఇరకగకుండా తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఒకే ఒక కేసు డేరింగ్‌ వర్మను భయపెడుతోంది.

ఇలా ఇరకాటంలో పడి.. 
సినిమాల పరంగా ఎన్నో ప్రయోగాలు చేసిన ఆర్జీవీ వైసీపీకి సపోర్ట్‌గా.. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ టార్గెట్‌గా సినిమాలు తీయటం, వారిపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టడంతో ఇరకాటంలో పడిపోయారు. 2019 ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఓ సినిమా తీశాడు. అందులో చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులను తప్పుగా చూపించాడనే కారణంతో దాని ప్రమోషన్‌ను అప్పుడు ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు అడ్డుకున్నారు. నాటి నుంచి టార్గెట్ టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోయాడు ఆర్జీవీ. 2019 ఎన్నికల్లో ఓడిన జనసేన పార్టీపైన సెటైరికల్ సినిమా తీశాడు. ఇక చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌పై కూడా సర్క్యాస్టిక్‌ పోస్టులు పెట్టేవారు వర్మ.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత చిట్టా మొత్తం బయటికి తీస్తోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు అయింది. వ్యూహం సినిమా ప్రమోషన్స్‌ టైమ్‌లో చంద్రబాబు, లోకేశ్‌ మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెట్టారంటూ ఫైల్ అయిన కేసులో విచారణకు రావాలని పోలీసులు 41ఏ నోటీసులిచ్చారు. అంతే అప్పటి వరకు సోషల్ మీడియాలో పులిలా రెచ్చిపోయిన వర్మ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. నన్ను కాపాడండి మహాప్రభో అంటూ హైకోర్టు మెట్లు ఎక్కేశాడు. తప్పుడు కేసు పెట్టారు కొట్టేయ్యండి అంటూ పిటిషన్ వేశాడు. తనను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ మొర పెట్టుకున్నారు.

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. ఈనెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తనకు 4 రోజుల సమయం కావాలంటూ రాంగోపాల్‌ వర్మ అదేరోజు వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత 25న ఉదయం విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపారు. గడువు ముగిసినా విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు.

ఫాంహౌస్‌లో ఉన్నట్లు వార్తలు
అయితే రాంగోపాల్‌వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్జీవీ హైదరాబాద్‌లో లేరని సినిమా షెడ్యూల్‌ ప్రకారం ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఇంటి దగ్గరున్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. అయితే వర్మ కోసం పోలీసులు రెండు టీమ్‌లుగా ఏర్పడి సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసు వ్యవహారం, అరెస్ట్‌ల కథ ఎలా ఉన్నా..ముంబై మాఫియానే లెక్కచేయని వర్మ..ఇప్పడు ఓ కేసులో ఇలా షేక్‌ అయిపోవడం మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాను ఎవరికీ భయపనని గొప్పగా చెప్పుకునే ఆర్జీవీ.. ఇలా 41ఏ నోటీసులకే భయపడటం ఏంటంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఆర్జీవీ ఇంత పిరికోడా అని తెగ ట్రోల్ చేస్తున్నారు. డేరింగ్ డైరెక్టర్‌కు థర్డ్ డిగ్రీ భయం పట్టుకుందని పోస్టులు పెడుతున్నారు.

అయితే గతంలో రాజకీయ నేతలు, పార్టీల విషయంలో వర్మ చేసిన కామెంట్స్‌ ప్రస్తావనకు వస్తున్నాయి. పొలిటికల్ లీడర్లను గెలికితే పట్టించుకోరని, వాళ్లకు ఎన్నో తలనొప్పులు ఉంటాయని..వాళ్ల బిజీలో వాళ్లు ఉంటారంటూ చెప్పుకొచ్చారు వర్మ. అందుకే తాను రాజకీయ నేతల విషయంలో కామెంట్స్ చేస్తానని..విమర్శలను పట్టించుకునే టైమ్‌ వాళ్లకు ఉండదన్నారు. ఇప్పుడు కూటమి సర్కార్ ఫోకస్ చేయడంతో..వర్మ నోటిదూలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకునే టైమ్ వచ్చిందంటూ పాత కామెంట్స్‌ను గుర్తు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గీకరణ లొల్లి.. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న లీడర్లు ఎవరు?