High Court : సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో ఒకటి, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. వీటికి మాత్రమే జీవో 35ని సస్పెండ్ చేసింది.

Movie Tickets

AP High Court key directions : సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. టికెట్ రేట్ల జీవో 35పై హైకోర్టులో మూడు వేర్వేరు రిటి పిటిషన్లు దాఖలయ్యాయి. మూడు పిటిషన్లకు కలిపి ఒకేసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పు వెలువరించింది.

తెనాలిలో 4 థియేటర్లు.. చోడవరంలో ఒకటి.. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ థియేటర్లకు మాత్రమే జీవో 35ని న్యాయస్థానం సస్పెండ్ చేసింది. జీవో 35 రద్దు పిటిషనర్లకు మాత్రమే వర్తింస్తుందని తెలిపింది. ఇదే అంశాన్ని తీర్పు ఏపీ హైకోర్టు కాపీలో స్పష్టం చేసింది.

Enquiry Committee : జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాద ఘటనపై విచారణ కమిటీ

మరోవైపు సినిమా టికెట్‌ ధరల తగ్గింపు జీవో 35 అమల్లోనే ఉందని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ స్పష్టం చేశారు. కోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు మాత్రమే మినహాయింపు ఆదేశాలు వర్తిస్తాయని చెప్పారు. టికెట్‌ ధరలపై ఎలాంటి కమిటీలు నియమించాల్సిన అవసరం లేదన్నారు.