Enquiry Committee : జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాద ఘటనపై విచారణ కమిటీ

నిన్న ప్రమాదానికి గురైన బస్సును 2019 లో తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు బస్సు 2 లక్షల కి.మీ మాత్రమే తిరిగిందని చెప్పారు. కోవిడ్ వలన ఏడాది పాటు షెడ్ నుంచి బయటకు తీయలేదన్నారు.

Enquiry Committee : జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాద ఘటనపై విచారణ కమిటీ

Bus Accident

Updated On : December 16, 2021 / 4:51 PM IST

bus accident at Jangareddy gudem : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో బస్సు ప్రమాద ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. బస్సు ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ డ్రైవర్ తో పాటు మరో 9 మంది చనిపోయారని పేర్కొన్నారు. బస్ కండీషన్ లోపమా? మెకానికల్ ఫెయిల్యూరా? డ్రైవర్ కండీషనా? అనే దానిపై విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు.

నిన్న ప్రమాదానికి గురైన బస్సును 2019 లో తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు బస్సు రెండు లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని చెప్పారు. కోవిడ్ వలన బస్సును ఏడాది పాటు షెడ్ నుంచి బయటకే తీయలేదని పేర్కొన్నారు. బస్ కండీషన్ బాగానే ఉందన్నారు. స్టీరింగ్ స్టక్ అయిపోతుందని కంప్లైంట్ ఏమీ గతంలో రాలేదు..రికార్డ్ మొత్తం చెక్ చేశే చెబుతున్నామని తెలిపారు.

Intermediate Exams Results : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విడుదల

బస్సు కూడా స్పీడ్ గా వెళ్ళడం లేదని చెప్పారు. ఆర్టీసీ బస్సులన్నీ ప్రతి రోజు డిపోలో కండీషన్ చెక్ చేసిన తర్వాతే బయటకు వదులుతామని పేర్కొన్నారు. బస్సు మెకానికల్ ఫెయిల్యూర్ ఏమీ లేదన్నారు. డ్రైవర్ హెల్త్ కండీషన్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. బస్సు ప్రమాదంలో తప్పిదం ఉంటే యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది.. ప్రచారాలకు చెక్ పెడతామని పేర్కొన్నారు.

నిన్న జరిగిన ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నామని తెలిపారు. పొరబాటును గుర్తించి బయటకు తీస్తాం….ప్రయాణికులు ఎవరూ వదంతులు నమ్మవద్దన్నారు. ఆర్టీసీలో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చన్నారు. నిన్న జరిగిన బస్సు ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Central Government : కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదే : కేంద్రం

జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో బస్సు పడటంతో డ్రైవర్ సహా పది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 13 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది

బస్సు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బస్సు బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది. ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. జల్లేరువాగులో పడిన బస్సును అధికారులు బయటికి తీశారు. క్రేన్ల సాయంతో బస్సును బయటికి లాగారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి బస్సును బయటికి తీశారు.

MLA Etala Rajender : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా : ఎమ్మెల్యే ఈటల

బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారు. కాగా బస్సు వేలేరుపాడులో నైట్ హాల్ట్ ఉన్నది. ఉదయం భద్రాచలం వెళ్లి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తోంది. జంగారెడ్డిగూడెంకు 10 కి.మీ దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.