MLA Etala Rajender : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా : ఎమ్మెల్యే ఈటల

థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. అన్నీ ఆలోచించే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.

MLA Etala Rajender : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా : ఎమ్మెల్యే ఈటల

Etala

Updated On : December 16, 2021 / 3:08 PM IST

Etala Rajender comments on CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ తో దోస్తీ ఉండదు…కొట్లాటేనని తేల్చి చెప్పారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టింది కేసీఆరేనని పేర్కొన్నారు.

థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. అన్నీ ఆలోచించే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీలో గ్రూపులు లేవని తెలిపారు. కాంగ్రెస్ లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.