Apoorva Srinivasan : సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్న టాలీవుడ్ భామ.. వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు..

ఇటీవల పలువురు నటీనటులు పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే తాజాగా నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి చేసుకుంది.

Apoorva Srinivasan : సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్న టాలీవుడ్ భామ.. వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు..

Apoorva Srinivasan Married Shreyas Shivakumar Wedding Photos goes Viral

Apoorva Srinivasan : ఇటీవల పలువురు నటీనటులు పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే తాజాగా నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి చేసుకుంది. టెంపర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన తెలుగమ్మాయి అపూర్వ శ్రీనివాసన్. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, విన్నర్, తొలిప్రేమ, కవచం, ప్రేమకథా చిత్రమ్ 2.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. చివరగా 2022లో నీతో సినిమాలో కనిపించిన అపూర్వ శ్రీనివాసన్ అప్పట్నుంచి సినిమాలకు దూరంగా ఉంది.

Also Read : Urvashi Rautela : ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన ఊర్వశి రౌటేలా.. ఆ ఫొటో వల్లే..

అపూర్వ శ్రీనివాసన్ ప్రస్తుతం పైలట్ గా ఉద్యోగం చేస్తుంది. తాజాగా శ్రేయాస్ శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తన పెళ్ళిఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే సింపుల్ గా అపూర్వ పెళ్లి చేసుకుంది. అపూర్వ పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పెళ్ళికి నటి సిమ్రాన్ చౌదరి హాజరైంది.