James
James: పునీత్ రాజ్ కుమార్.. కన్నడ ఆడియన్స్ కి ఓ ఎమోషన్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన పునీత్.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఆయన నటించిన లాస్ట్ సినిమా జేమ్స్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పేట్రియాటిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో పునీత్ క్యారెక్టర్ ఏంటి..? అసలు సినిమా రిలీజ్ఎప్పుడు? జేమ్స్ మూవీ టీమ్ పునీత్ కి ఎలాంటి ట్రిబ్యూట్ ఇవ్వబోతుంది అంటూ పునీత్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Venky Kudumula Film: హీరోయిన్ దొరికేసినట్లే.. మెగాస్టార్ జోడీగా మాళవికా
కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఎదిగిన పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే హార్ట్ ఎటాక్ తో చిన్న వయసులోనే చనిపోయిన పునీత్రాజ్ కుమార్ లాస్ట్ సినిమా జేమ్స్ రిలీజ్ కోసం ఫాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ యాక్టింగ్ తోనే కాకుండా సోషల్ సర్వీస్ తో కూడా అందరికీ దగ్గరవడంతో జస్ట్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కన్నడ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉంది.
Jr NTR: ముహూర్తం పెట్టేసిన యంగ్ టైగర్.. ఇక నాన్ స్టాప్ లెక్కే!
పునీత్ చనిపోయే టైమ్ కి రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి జేమ్స్ అయితే మరొకటి ద్విత్వ. ఈ రెండు సినిమాల్లో జేమ్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. శ్రీకాంత్ విలన్ గా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా 60కోట్ల బడ్జెట్ తో రెండేళ్ల క్రితం షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా కంప్లీట్ కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. చేతన్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాని పత్తికొండ కిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మార్చి 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ తో పాటు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో పునీత్ క్యారెక్టర్ కి శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెబుతున్నారు.
Telugu Films Shooting: నాన్ స్టాప్ షూటింగ్ లో సూపర్ స్టార్స్!
లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ తెరమీదకి రావడంతో ఫ్యాన్స్ అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. రిపబ్లిక్ డే సందర్బంగా జేమ్స్ మూవీకి సంబంధించి పునీత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీమ్. ఆర్మీ డ్రెస్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్న పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో మరే సినిమా రిలీజ్ చెయ్యొద్దని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లుకూడా డిసైడ్ అయనట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో బాడీ బిల్డప్ చెయ్యడానికి చాలారోజులు ఫిట్ నెస్ మీదే కాన్సన్ ట్రేట్ చేశారు పునీత్. మార్చి 17న తమ ఫావరెట్ హీరో అప్పు చివరి సారిగా చేసిన సినిమా కోసం ఫాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.